వినాయక చవితి ఉత్సవాలు చెయ్యాలంటే ఇలా చేస్తేనే పర్మిషన్

By RK Competitive Adda

Updated On:

 

 

 

 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక మంటపం ఏర్పాటు చేయు ప్రజల కోసం ప్రత్యేకంగా ఒక సింగిల్ విండో క్లియరెన్స్ విధానం తీసుకుని వచ్చింది. ఇంతకు ముందు వినాయక మంటపం ఏర్పాటు కోసం ప్రజలు అగ్నిమాపక శాఖ, పురపాలక శాఖ, విద్యుత్ శాఖ మరియు పోలీసు శాఖల నుంచి నిరభ్యంతర (NOC) పత్రం తీసుకోవలసి ఉండేది. దీనికోసం ప్రజలు ఆయా శాఖల చుట్టూ తిరగవలసి వచ్చేది. ప్రజల వెసులుబాటు కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సింగిల్ విండో క్లియరెన్స్ విధానం రూపొందించినది.

ఇందులో భాగంగా ప్రజలు 7995095800 మొబైల్ నంబర్ కు WhatsApp ద్వారా Hi అని సందేశం పంపిస్తే చాలు, నిరభ్యంతర పత్రం కోసం అనుసరించవలసిన ప్రక్రియ మొత్తం WhatsApp ద్వారా ప్రజల యొక్క మొబైల్ ఫోన్ కు వస్తుంది.

ఆ తరువాత ప్రజలు ganeshutsav.appolice.gov.in అనే వెబ్సైట్ నందు గణేష్ మంటపం ఏర్పాటు చేయదలచిన కమిటి సభ్యుల వివరాలు, మంటపం ఏర్పాటు చేయు ప్రదేశం, ఏ పోలీసు స్టేషన్ పరిధి లోకి వస్తుంది, విగ్రహం ఎత్తు, మంటపం ఎత్తు, విగ్రహ ప్రతిష్ఠ ఏ రోజు జరుగుతుంది, నిమజ్జనం ఎక్కడ ఏ సమయం లో చేస్తారు, ఏ వాహనం ద్వారా నిమజ్జనం చేస్తారు వంటి వివరాలను నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు సంబంధిత పోలీసు స్టేషన్ ఎస్. హెచ్.ఓ (SHO) గారికి వెళ్తుంది. ఎస్.హెచ్.ఓ (SHO) గారి

ఆధ్వర్యంలో పురపాలక శాఖ, అగ్ని మాపక శాఖ మరియు విద్యుత్ శాఖల యొక్క సిబ్బంది ఒక బృందంగా

ఏర్పడి మంటపం ఏర్పాటు చేయు ప్రదేశమును సందర్శించి ఏర్పాట్లను పరిశీలించి సానుకూలంగా ఉంటే QR

కోడ్ తో కూడిన నిరభ్యంతర పత్రం జారీ చేస్తారు మరియు అనుమతికి అవసరం అయిన రుసుము వివరాలు

తెలియచేస్తారు. ప్రజలు వారికి దగ్గరలో ఉన్న మీసేవ కేంద్రము నందు తగిన రుసుమును చెల్లించి ఆ

రసీదును వెబ్సైట్ లో అప్లోడ్ చేసినయెడల ఎస్. హెచ్.ఓ (SHO) గారు వాటిని పరిశీలించి వెంటనే నిరభ్యంతర

(NOC) పత్రమును జారీ చేస్తారు.

ఈ నిరభ్యంతర పత్రాన్ని ప్రింట్ తీసి గణేష్ మంటపంలో ఉంచవలెను. పోలీసువారు సందర్శన సమయములో QR కోడ్ ని స్కాన్ చేసి తనిఖీ చేస్తారు.

https://whatsapp.com/channel/0029Vafc2q2Fsn0XGjg5pr12

 

RK Competitive Adda

RK Competitive Adda అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉద్యోగాలు మరియు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వెబ్‌సైట్. మేము తాజా నోటిఫికేషన్లు, ఉద్యోగ సమాచారాలు, మరియు క్విజ్‌లను అందిస్తున్నాము.

error: Content is protected !!