YSR KADAPA జిల్లాలో ICDS ప్రాజెక్టుల పరిదిలో ఖాళీగా యున్నటువంటి దిగువ తెలుపబడిన మరియు జతపరచబడిన జాబితాల యందు పేర్కొనబడిన పోస్టుల భర్తీకొరకు అమలులోయున్న ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము ఎంపిక ప్రక్రియ నిర్వహించబడును.
పోస్టులు వివరాలు :
అంగన్వాడి కార్యకర్త (AWW) -11
అంగన్వాడి సహాయాకురాలు (AWH)-59
మినీ అంగన్వాడి కార్యకర్త (Mini AWW)-04
మొత్తం పోస్టులు : 74
అర్హతలు :
II) ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 21, తేది: 24.08.2007 మరియు 38, తేది: 03.11.2008 ప్రకారము పై తెలుపబడిన పోస్టులకు అవసరమైన అర్హతలు దిగువతెలుపబడినవి:
a) 01.07.2024 వ తేదీ నాటికి అభ్యర్థులు 21 సం. దాటి 35సం. లోపు వయ్యస్సు కలవారై యుండవలయును.
b) దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి ఉండాలి.
c) అంగన్వాడి కార్యకర్త పోస్టు కొరకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు 10వతరగతి ఖచ్చితంగా ఉత్తీర్ణులై యుండవలయును.
d) అంగన్వాడి సహాయకురాలు & మినీ అంగన్వాడికార్యకర్త పోస్టులకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు 7వతరగతి ఖచ్చితంగా ఉత్తీర్ణులై యుండవలయును. 7వతరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అందుబాటులో లేనట్లయితే, తదుపరి దిగువ తరగతులలో అత్యధిక అర్హత కలిగిన అభ్యర్థిని పరిగణనలోకి తీసుకొనబడుతుంది.
e) యస్.సి./ఎస్.టి. హబిటేషన్ల కొరకు కేటాయించిన అంగన్వాడికేంద్రముల (మెయిన్ /మినీ) యందు కేవలం యస్.సి. / యస్. టి. అభ్యర్థులుమాత్రమేఎంపికచేయబడుదురు.
f) నోటిపై చేయబడిన యస్.సి./యస్.టి. అంగన్వాడి కేంద్రములకు యస్.సి./ఎస్.టి. అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకొనవలయును. మరియు నోటిఫై చేయబడిన యస్.సి. / యస్.టి. అంగన్వాడి కేంద్రముల పోస్టులకు సంబందించి 21 సం. లు దాటిన అభ్యర్థులు అందుబాటులో లేనప్పుడు, 18 సం. వయస్సున్న అభ్యర్థుల దరఖాస్తులు పరిగణలోనికి తీసుకొనబడును (18 to 35 years of age)
కావున అభ్యర్థులుపై తెలుపబడిన 1 నుండి 5 పారామీటర్లకు సంబందించి నపూర్తి సమాచారమును దరఖాస్తు ఫారం యందు ఖచ్చితముగా నమోదు చేసి వాటికి సంబందించిన దృవీకరణ పత్రముల నకలులు మరియు పై తెలుపబడిన అన్ని అర్హతలు తదితరములకు సంబందించిన దృవీకరణ పత్రముల నకలులు ఏదేనా గజిటెడ్ అధికారి వారిచే అటెస్టేషన్గావింపబడిన నకలులు దరఖాస్తునకు ఖచ్చితంగా జతపరచవలయును. అట్లు జతపరచని ఎడల వాటికి సంబందించిన సమాధారమును పరిగణలోనికితీ సుకొనబడదు.
IV) ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 39, తేది: 06.09.2011 ప్రకారం పై తెలుపబడిన ఖాళీల భర్తీయందు ఐ.సి.డి.యస్. ప్రాజెక్టు ఒక యూనిట్ గా పరిగణిస్తూ రూల్అప్ రిజర్వేషన్ అమలు చేయబడుతుంది. జతపరచబడిన జాబితాల యందు పోస్టునకు ఎదురుగా కేటాయించబడిన కేటగిరికి చెందిన అభ్యర్థులు మాత్రమే సదరు పోస్టునకు అర్హులు, మరియు సదరు కేటగిరినకు సంబందించి నిర్దేశిత అధికారి వారిచే జారీచేయబడిన, నిబందనల ప్రకారం వ్యాలిడిటి కలిగిన దృవీకరణ పత్రముల నకలులు దరఖాస్తునకు ఖచ్చితంగా జతపరుద వలయును (యస్.సి./ఎస్.టి. /బి.సి. /EWS / Minar Locomotor Disability/ Disabled కేటగిరినకుచెందినవారుమాత్రమే), అట్టు జతపరచని ఎడల వాటికి సంబందించిన సమాచారమును పరిగణలోనికి తీసుకొనబడదు మరియు అట్టి దరఖాస్తులు invalid గా పరిగణించబడును (ఓ.సి. కేటగిరి క్రింద కేటాయించబడిన పోస్టులకు పై అర్హతలు కలిగియున్న ఎవ్వరైననూదరఖాస్తుచేసుకొనవచ్చును),
V) Memo No. 4918/K3/2015, Dt. 30.10.2015 ప్రకారం అభ్యర్థుల ఎంపికలో అంగన్వాడి కేంద్రము ఉన్న గ్రామమును స్థానికతకు ప్రాతిపదికగా తీసుకొనుట జరుగును. అదేవిధముగా మునిసిపాలిటి పరిదిలో వార్డును స్థానికతకు ప్రాతిపదికగా తీసుకొనుట జరుగును. కావున అభ్యర్థులు వారి స్థానికతకు సంబందించి పూర్తి సమాచారమును దరఖాస్తు ఫారం యందు నిర్దేశిత coloumnలో పొందుపరిచి వాటి దృవీకరణ పత్రములు అనగా ఆధార్ కార్డు / రేషన్ కార్డ్/వోటర్ కార్డ్ / మీ సేవ ద్వారా జారీ చేయబడిన దృవీకరణ పత్రములను విధిగా దరఖాస్తునకు జతపరుచవలయును. అట్లుజతపరచని ఎడలవారి దరఖాస్తు పరిగణలోనికి తీసుకొనబడదు.
VI) 50 2 2 WDC01/1481061/2020/Prog.II/A1, 00: 25.08.2021 ప్రకారంమినీ అంగన్వాడీ వర్కర్లఎంపికలో వికలాంగులకురిజర్వేషన్నియమంపిల్లల భద్రత దృష్ట్యా పూర్తిగామి సహాయించబడుటయినది. అంగన్వాడీకార్యకర్తలు మరియు సహాయకురాలులకు సంబంధించి, 6 (అంధత్వం మరియుతక్కువదృష్టి), 31 (చెవిటి వారు మరియు వినికిడి లోపం) మరియు 86 (ఆటిజం, మేధోపరమైనవైకల్యం, నిర్దిష్ట అభ్యాస వైకల్యం, మానసిక వైకల్యం, బహుళ వైకల్యాలు) వరోస్టర్పాయింట్రేజర్వేషన్కు మినహాయింపుఉంది. పిల్లల భద్రత మరియు శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని, మైనర్లోకోమోటర్వైకల్యం ఉన్న వ్యక్తులు మాత్రమే పిల్లల సంరక్షణ మరియు గృహసందర్శనల సామర్థ్యానికి ఆటంకం కలిగించని 4 వైకల్యం రోస్టర్‌పాయింట్ లకు వ్యతిరేకంగా పరిగణించబడతారు. మైనర్లోకోమోటర్వైకల్యం ఉన్న అటువంటి అర్హత గల వ్యక్తి లేకుంటే, 6, 31 మరియు 86 వద్ద ఉన్న రోస్టర్పాయింట్లను వైకల్యం ఉన్నవ్యక్తులతో కాకుండా ఇతరులతో నింపబడుదురు. 56 వద్ద ఉన్నరోస్టర్పాయింటు మాత్రమే తదుపరి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌కు ఫార్వార్డ్ చేయబడవచ్చు మరియు రెండవ నోటిఫికేషన్ లో కూడా మైనర్లోకోమోటర్ వైకల్యం ఉన్న
అర్హత గల అభ్యర్థి లేకుంటే, రోస్టల్పాయింట్ 56 కూడా వికలాంగులు కాకుండా ఇతరులతో నింపవచ్చు.. కావున తదనుగుణంగా ఈ ప్రకటన యందు రోస్టర్ పాయింట్లు కేటాయించడం జరిగినది.
VII) ప్రకటింపబడిన పోస్టులలో గౌరవ న్యాయ స్థానముల యందు కేసులుపిండింగులో ఉన్నవాటి భర్తనకు సంబందించి, ఆయా కేసులకు సంబందించి వెలువడు తదుపరి ఉత్తర్వులు మేరకు వారి నియామకము రద్దుపరచుటకాని, కొనసాగింపు కాని జరుగును.
VIII) అంగన్వాడీ కార్యకర్త (Main & Mini), అంగన్ వాడీ హెల్పర్లు గౌరవకార్యకర్తలు, కావున ఈ నియామకము పూర్తిగా తాత్కాలికము మరియు పోస్టులకు నియామకమగు అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారము గౌరవ వేతనము మాత్రమే చెల్లించబడును.
దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు తమ పూర్తి బయోడాటాతో పై తెలుపబడిన విధముగా వారి అర్హతలకు సంబందించిన అన్నిదృవీకరణ పత్రములను ఏదేనా గజిటెడ్ అధికారివారితో అటీస్టేషన్చేయించి,
వాటిని సంబందిత శిశు అభివృద్ది పథకఅధికారి వారికా ర్యాలయము (ఐ.సి.డి.యస్. ప్రాజెక్టు కార్యాలయం) యందు సమర్పించి తగు రశీదు పొందవలయును.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తేది : 17.09.2024
ఇంటర్వ్యూ నిర్వహణ తేది : 28.09.2024
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశము : 28/09/2024
ఇంటర్వ్యూలు నిర్వహించే ప్రదేశం : జిల్లా మహిళా & శిశు సంక్షేమ
సాధికారిత అధికారి, వారి కార్యాలయము, కడప
ఈ ప్రకటనను ఎటువంటి కారణములు లేకనే రద్దు పరచుటకుగాని మరియు వాయిదా వేయుటకు గాని లేక మార్పులు చేర్పులు చేయుటకు గాను జిల్లా కలెక్టర్ అధ్యక్షులు,జిల్లా మహిళా & శిశు సంక్షేమ సాదికారితా అధికారి వారి కార్యాలయము, కడప వారికి సర్వహక్కులు కలవు.
ఈ నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫారంను క్రింద లింకు నుండిడౌన్లోడ్ చేసుకొనగలరు.
1 thought on “Anganwadi Jobs 2024 అంగన్వాడీలో వర్కర్ హెల్పర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్”
Comments are closed.