3 వ తరగతి తెలుగు – కంటెంట్ న్యూ సిలబస్
- తెలుగు తల్లి
- ప్రక్రియ : గేయం
- ఇతివృత్తం : దేశభక్తి
- కవి : శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ)
- కాలం : (14/4/1910 – 15/6/1983)
- రచనలు : మహాప్రస్థానం, మరో ప్రస్థానం, ఖడ్గసృష్టి
- స్వీయచరిత్ర : అనంతం
- శ్రీశ్రీ మహాప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన.
- శ్రీశ్రీ అభ్యుదయ యుగకర్త, మహాకవి.
తల్లీ భారతి వందనము
- రచయిత : దాశరథి కృష్ణమాచార్యులు
- కాలం : (22/7/1925 – 5/11/1981)
- రచనలు : అగ్నిధార, రుద్రవీణ, మహాంద్రోదయం,తిమిరంతో సమరం.
- స్వీయచరిత్ర : యాత్రా స్మృతి
- నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా ఉన్నారు
ఐకమత్యం
- రచయిత : లియోటాల్ స్టాయ్
- కాలం : (09/09/1828 – 20/11/1910)
- రచనలు : సమరం-శాంతి, ఆనాకెరినినా (నవలలు)
- ఉద్దేశ్యం : రామాపురం అనే గ్రామంలో ఉండే రైతు తన ముగ్గురు కుమారులకు ఐకమత్యం గొప్పతనాన్ని పుల్లలకట్ట సహాయంతో తెలియజేయడమే ఈ కథ ఉద్దేశ్యం.
- ఐకమత్యం కథకు టాల్ స్టాయ్ కథ ఆధారం.
- టాల్ స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి పొందిన రష్యన్ కథకులు.
- మర్యాద చేద్దాం
- ప్రక్రియ : కథ
- ఇతివృత్తం : హాస్యం
- మూలం : పరమానందయ్య కథ
- పాత్రలు : పరమానందయ్య, పేరయ్య అనే పండితుడు, శిష్యులు
- పూర్వం కళింగ రాజ్యంలో పరమానందయ్య అనే పండితుడు ఉండేవాడు.
- పరమానందయ్యకు 12 మంది శిష్యులు.
- పరమానందయ్య ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు సంఖ్య – .
- ఒకరోజు పరమానందయ్యగారు భార్యతో కలసి గుడికి వెళ్ళారు.
- సమయానికి నువ్వు రాకపోతే చంపేవారుగా పరమా అని పేరయ్య అనే పండితుడు పరమానందయ్యతో అన్నాడు.
- * “ఒరేయ్ మన ఇంటికి వచ్చే అతిథుల్ని గౌరవించి మర్యాదలు చెయ్యాలి” అని ఎవరు చెప్పారు? – పరమానందయ్య శిష్యులతో.
- పాపం వాళ్ళకేమి తెలియదు క్షమించు – పేరయ్య,పరమానందయ్యతో అన్నాడు.
- పరమానందయ్యగారు భార్యతో కలిసి పొరుగూరు పేరయ్య కూతురు పెళ్ళికి వెళ్ళారు.
రేలా…. రేలా….
- ఇది ఒక జానపద గేయం.
- అడవి తల్లికి దండాలో – మాతల్లి అడవికి దండాలో అడవి చల్లంగుంటే – అన్నానికి కొదవేలేదు. అనే పంక్తులు గల పాఠం – రేలా… రేలా..
- ఏటిలోన ఊట చూడు నీటిలోన సుడులు చూడు – ఈ పంక్తులు ఈ గేయంలోనివి.
- పావురాల జంట చూడు పాలపిట్ట పాట చూడు – రేలా… రేలా..
జింక
- ఇది ఒక ఈసఫ్ కథలు.
- ఈసఫ్ కథలు గ్రీకు పురాణ కథలు, ఇవి 2500 సంవత్సరాల నాటివి.
- ఈ కథలు అన్ని ప్రపంచ భాషలలోకి అనువదించబడ్డాయి.
- ఈ పాఠంలో జింక కొమ్ములు కొమ్మలకు తగులుకొని ఇరుక్కుపోయాయి.
- మంచి బాలుడు
- ప్రక్రియ : గేయకథ
- ఇతివృత్తం : సహానుభూతి
- కవి : ఆలూరి బైరాగి
- కాలం : (05/11/1925 – 09/09/1978)
- రచనలు : చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమగీతి, దివ్యభవనం.
- కష్టాలలో ఉన్నవారికి సాయం చెయ్యని మనిషి జీవితం వ్యర్థం అని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశ్యం.
- తళ తళ మిల మిల మెరుపులు మెరసి సూరున, జోరున వర్షం కురిసి – అనే మాటలతో ప్రారంభమయ్యే పాఠం – మంచి బాలుడు.
- “దుర్బలులకు సాయం చేయని యెడ కొరగా దెందుకు మనుజుని మనుగడ” – మంచి బాలుడు.
- 20 శతాబ్దపు అగ్రశ్రేణి కవులలో “ఆలూరి బైరాగి” ఒకరు
- మానవుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించారు.
- ఈయన “ఆగమగీతి” రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు.
- తళ తళ, మిల మిల, గడగడ, కిలకిల, గణ గణ వంటి పదాలను అనుకరణ పదాలు అంటారు.
కలపండి చేయి చేయి
- కవి : దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి
- కాలం : (01/11/1897 – 24/02/1980)
- రచనలు : కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసము
- కవిత్వ లక్షణాలు : అక్షర రమ్యత, భావనా సౌకుమార్యం ,శబ్ద సంస్కారం
- పురస్కారం : పద్మభూషణ్
వీరు ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వ యుగానికి తలుపులు తెరిచారు. అచ్చమైన తెలుగుకవి. వీరి కవిత్వాన్ని శ్రీశ్రీ ఇక్షు సముద్రంతో పోల్చారు.
- కొండ రాళ్లు పగలగొట్టి కోన చదును చేద్దాం కోన వెంట దారితీసి రాదారులు వేద్దాం – ఈ గేయం కలపండి చేయి చేయి
- పాడుకుంటు పనిచేస్తే పదిమందికి లాహిరి ఆడుకుంటూ పనిచేస్తే అనిపించదు చాకిరి – కలపండి చేయి చేయి
- ఈ గేయంలో కవి ప్రస్తావించిన ఊర్లు – కలకత్తా, కాశ్మీరం, కాశీ, కన్యాకుమారి
బావిలో నీళ్ళు
- ఇది ఒక అక్బర్ – బీర్బల్ కథ.
- ఇందలి పాత్రలు : అక్బర్ (రాజు), బీర్బల్ (మంత్రి), రైతు(జమీందారు)
- ఈ పాఠంలో జమీందారు రైతుకు బావి అమ్మాడు.
- నేనే నీకు బావిని అమ్మాను కానీ అందులో నీటిని కాదు అని జమీందారు రైతుతో అన్నాడు.
- “సరే నువ్వు బావి ఒక్కటే అమ్మావు, నీళ్ళు అమ్మలేదు కదా! అని అన్నది ఎవరు? – బీర్బల్, జమీందారుతో.
- రైతు బావిలో నీ నీళ్ళన్నీ ఉన్నాయి. వెంటనే నీ నీళ్ళన్నీ తోడుకొని వెళ్ళిపో అని ఎవరు అన్నారు? – బీరల్ జమీందారుతో