AP TET DSC 3RD CLASS TELUGU CONTENT NOTES PART 2

  1. నా బాల్యం
  • ప్రక్రియ : ఆత్మకథ
  • ఇతివృత్తం : కళలు
  • కవి : షేక్ నాజర్, ఖాదర్ (హార్మోనిస్ట్, నాజర్ గారి గురువు), షేక్ మస్తాన్ (నాజర్‌గారి తండ్రి)
  • షేక్ నాజర్ తన జీవితకథను తానే చెప్పుకున్నట్లుగా అంగడాల రమణమూర్తి అక్షరీకంరించాడు. స్వీయచారిత్రాత్మకమైన ఈ కథకు పింజారీ అని పేరుపెట్టారు.

ముఖ్య అంశాలు :

  • పొన్నెకల్లు తూర్పువీధిలో సాయిబుల ఇంటిలో షేక్ నాజర్ జన్మించాడు.
  • తను పుట్టగానే తన గారపాడు తాత తనను అబ్దుల్ అజీజ్ అని పిలిచాడు.
  • కాని తనను నాజర్ అని పిలవాలని తండ్రి ఆశ.
  • గారపాడు మామలు అత్తలు తనను అబ్దుల్ అజీజ్ అని పిలిచారు.
  • పొన్నెకల్లు పెదనాన్నలు, చిన్నాన్నలు, అమ్మలు, అక్కలూ “నాజర్” అని పిలిచేవారు.
  • నాజర్ చిన్ననాటి గురువు – ఖాదర్. నాజర్ తండ్రి – మస్తాన్.
  • నాజర్ తన చిన్నతనంలో పాఠశాల వార్షికోత్సవంలో ఉద్రోణ విజయం” అనే చిన్న నాటికను ఆడారు.
  • నాజర్ ప్రతిభను గుర్తించిన ఉపాధ్యాయులు ఐదురూపాయలు, పుస్తకం, పెన్సిలు బహుమతిగా ఇచ్చారు.

షేక్ నాజర్ జీవిత విశేషాలు :

షేక్ నాజర్ నిరుపేద ముస్లిం కుటుంబంలో గుంటూరుజిల్లా పొన్నెకల్లు గ్రామంలో 1920 ఫిబ్రవరి 5వ తేదీన జన్మించారు. నాజర్ తండ్రి – షేక్ మస్తాన్, తల్లి – బీనాబీ. తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహంతో ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథ ప్రక్రియకు నాజర్ కొత్త మెరుగులు దిద్దారు.

  • పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు వంటి ఇతివృత్తాలతో సమకాలీన అంశాలు జతచేసి నాజర్ బుర్రకథలు రూపొందించారు.
  • నాజర్‌కు భారత ప్రభుత్వం 1986లో పద్మశ్రీ పురస్కారంతో సత్యరించింది.
  • నాజర్ 1997 ఫిబ్రవరి 21వ తేదీన మరణించారు.

పదాలు – అర్థాలు :

  • ఆరుగాలం = ఏడాది అంతా
  • గుంజ – రాట
  • పామరులు = చదువుకోనివారు

పర్యాయ పదాలు :

  • గుంజ = రాట, నిట్టాడు, స్తంభం
  • చిన్నాన్న = బాబాయి, పినతండ్రి, చిన్నబ్బ, చిన్నాయన
  • బువ్వ అన్నం, కూడు, మెతుకులు

ప్రశ్నార్థక వాక్యాలు :

  1. బాబూ! నీ పేరేమిటి ?
  2. గీతా మీ ఊరు ఏది ?
  3. నీవు ఏ తరగతి చదువుతున్నావు?
  4. లతా! నీవు ఎక్కడికి వెళుతున్నావు?
  • “ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు” వంటి పదాలను ప్రశ్నార్థక పదాలు అంటారు.

ఆశ్చర్యార్థక వాక్యాలు :

  1. అబ్బో! జూ ఎంత అందంగా ఉందో!
  2. జిరాఫీ ఎంత ఎత్తుగా ఉందో!
  3. అమ్మో సింహాన్ని చూడగానే ఎంత భయమేసిందో!
  4. పక్షులను చూడగానే ఎంత ముచ్చట వేసిందో!
  • కొండపల్లి కొయ్యబొమ్మలను పొణికి కరతో తయారు చేస్తారు.
  • కొండపల్లి కృష్ణాజిల్లాలో కలదు.
  •  కొండపల్లి బొమ్మలు చేసేవారి పూర్వీకులు రాజస్థాన్ నుండి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు.

బంగారు పాపాయి

  • కవి : మంచాళ జగన్నాథరావు
  • కాలం : (1921 – 1985)
  • మంచాళ జగన్నాథరావు కవి, సంగీత విద్వాంసులు. ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులకు స్వరరచన చేశారు.
  • బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మా మంచి చదువు – పల్లవి
  • బంగారు మొలక
  • * ఈ పాఠంలో రాజుకు మామిడి మొక్కతో కనిపించినది – ముసలాయన.
  • * రాజు ముసలివాడికి పాతిక బంగారు నాణేలు అందించాడు.
  • * ఏ పని అయినా మన కోసమే చేయవలసిన పనిలేదు.రేపటి కోసం కూడా చేయాలి. అని తెలియజేయడమే ఈ కథ ఉద్దేశ్యం.

5. పొడుపు-విడుపు

  • ప్రక్రియ : సంభాషణ
  • ఇతివృత్తం : భాషాభిరుచి
  • కవి : చింతా దీక్షితులు
  • కాలం : (25/08/1891 – 25/08/1960)
  • రచనలు : ఏకాదశి, శబరి, వటీ రావు కథలు,
  • లక్కపిడతలు పాత్రలు : గిరి (అన్న), సూరి (తమ్ముడు), సీతి, వెంకి
  • తెలుగులో బాలసాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు – చింతా దీక్షితులు.
  •  గిరిజనులు గురించి, సంచార జాతులను గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత.
  • వేసవి సెలవుల్లో గిరి, సూరి వాళ్ళ మామయ్యగారి ఊరు వెళ్ళారు.
  • వసారాలో చందమామ కథల పుస్తకాన్ని చదువుతున్నది ఎవరు? – గిరి.
  • నడవలో మంచం మీద పడుకున్నది – సూరి, సీతి, వెంకి

పొడుపు కథలు :

  1. తీసేకొద్దీ పెరిగేదేమిటి ? – గొయ్యి
  2.  వెండి గొలుసు వెయ్యడమేగాని, తియ్యలేము – ముగ్గు
  3. నూరు చిలకలకు ఒకటే ముక్కు – పళ్ళగుత్తి ,
  4. పచ్చ చొక్కా వాడు చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు – అరటిపండు
  5. ఇంట్లో రోకలి … ఒంట్లో – ఆకలి
  6. అడవిలో పుట్టింది అడవిలో పెరిగిందిమా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది – కవ్వం
  7. తెల్లని పొలంలో నల్లని విత్తనాలు చేత్తో చల్లుతారు నోటితో ఏరుతారు – అక్షరాలు
  8. చెయ్యని కుండ పొయ్యని నీళ్ళు వెయ్యని సున్నం తియ్యగనుండు – కొబ్బరికాయ
  9. పైనొక పలక కిందొక పలక పలకల నడుమ మెలికల గిలక – నాలుక
  10. అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు కొమ్మ కొమ్మకు కోటిపూలు – పువ్వుల్లో రెండే కాయలు – నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు,
  • పొడుపు అనగా ప్రశ్న, విడుపు అనగా సమాధానం.
  • కుర్చీలో కూర్చుని దినపత్రిక చదువుతున్నది – మావయ్య
  • ఎప్పుడూ కథలేనా? ఇంకేమైనా చెప్పు అన్నదెవరు? – సీతి, సూరితో
  • ఓహో! నోరు అంటే నుయ్యి అన్నమాట అని ఎవరు అన్నారు? – సీతి, సూరితో
  • ఆ! నుయ్యి మాత్రం పెరగదా ఏమిటి? — సూరి, సీతితో అన్నాడు

చందమామ

  • కవి : నండూరి రామ్మోహనరావు
  • కాలం : (24/04/1927 – 02/09/2011)
  • రచనలు : హరివిల్లు, నరావతారం, విశ్వరూపం, విశ్వదర్శనం, అక్షరయాత్ర
  • ఈయన రాసిన బాలగేయాల సంపుటి – హరివిల్లు
  • నరావతారం, విశ్వరూపం ద్వారా విజ్ఞానశాస్త్రాన్ని సులభశైలిలో పాఠకకులకు పరిచయం చేసారు.
  • విశ్వదర్శనం, అక్షరయాత్ర వంటి రచనలతో పాటు మార్క్ ట్వేయిన్ రచించిన టామ్ సాయర్, హకల్ బెరిఫిన్ వంటి అనువాదాలు కూడా చేశారు.

వికటకవి

  •  ఈ పాఠం తెనాలి రామకృష్ణ కథలు లోనిది.
  •  కృష్ణాతీరంలో గార్లపాడు అనే ఊరు ఉంది.
  •  గార్లపాడులో రామయ్య మంత్రి అనే పండితున్నాడు.
  • రామయ్య మంత్రి యొక్క భార్య – లక్ష్మమ్మ, కుమారుడు – రామకృష్ణుడు.
  •  రామకృష్ణుని తండ్రి చిన్నతనంలోనే మరణించాడు.
  • రామకృష్ణుడు మేనమామ ఇంటిలో పెరిగాడు.
  • రామకృష్ణునికి మంత్రం చెప్పినవారు – సాధువు.
  • రామకృష్ణుడు మంత్రాన్ని పరీక్షించడానికి కాళికాదేవి గుడికి వెళ్ళాడు.
  • కాళికాదేవి రెండు చేతులలో రెండు పాత్రలతో ప్రత్యక్షమయ్యింది.
  • కాళికాదేవి రామకృష్ణున్ని వికటకవిగా అవుతావని చెప్పింది.
  1. మేమే మేక పిల్ల
  • ప్రక్రియ : కథ
  • ఇతివృత్తం : పరస్పర సహకారం

ఈ పాఠం చందమామ కథల నుండి సేకరించబడినది 1949 బాపట్లకు చెందిన ఆర్. శకుంతల రచించిన చందమామ కథే ఈ పాఠ్యాంశం అవసరంలో ఉన్నవారికి నహాయం చేయాలని తెలియజేయడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశ్యం.

 పాఠ్యాంశాలు :

  1. ఒక ఊరిలో ఒక మేక దానికి నాలుగు పిల్లలు.
  2. నాలుగో దాని పేరు మేమే దానికి తొందర ఎక్కువ మాట వినదు.
  3.  ఒకరోజు మేమేకి ఢిల్లీ రాజును చూడాలని బుద్ధి పుట్టింది.
  4.  దారిలో మేమేకు ఏరు, మంట, గాలి ఎదురయ్యాయి వాటికి మేమే ఏ సహాయం చేయలేదు.
  5. “కొంచెం ఈ కంచె జరుపవూ, నాకు ముళ్లు గుచ్చుకుంటున్నాయి” అని ఎవరు అన్నారు ? – గాలి.
  6. *నా మాట విన్నావా ? నాకు సాయం చేశావా ? నేను ఇప్పుడు నీకెందుకు సాయం చేయాలి? – నీరు
  7.  నీ మాట నేనెందుకు వినాలి ? నీకెందుకు సాయం చేయాలి ? – నిప్పు.
  8. “నీవు ఎవరికి సాయం చేయలేదు మరి నీకెవరు సాయం చేస్తారు ?” అని అన్నది ఎవరు ? – గాలి.

నామవాచకాలు : పేర్లను తెలిపేవి నామవాచకాలు. ఉదా : రామకృష్ణ, విజయనగరం, పుస్తకము.

సర్వనామాలు : నామవాచకాలకు బదులుగా వాడే పదాలను సర్వనామాలు అంటారు.  ఉదా : అతడు, ఆమె, అది, ఇది.

తెలుగు తోట

  • కవి : కందుకూరి రామభద్రరావు
  • కాలం : (31/01/1905 – 08/10/1976)
  • రచనలు : లేమొగ్గ, తరంగిణి, గేయమంజరి
  • ఏ నందనము నుండి ఈనారు తెచ్చిరో ఏ స్వర్ణనదీజలము ఈమడులకెత్తితో – చరణం
  • ఏ అమృత హస్తాల ఏసురలు తాకిరో ఏ అచ్చెరల మెరుపు లీతీరు దిద్దిరో – తెలుగుతోట

మేకపోతు గాంభీర్యం

  1. ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు అని తెలియజేయడమే ఈ కథ ఉద్దేశ్యం. * ఈ పాఠంలో మేక ఇంటి దారికోసం వెతుకుతూ అడవిలోనికి వెళ్ళింది.
  2. ఒక రాతి గుహలోనికి వెళ్ళి పడుకుంది.
  3. నా గురించి వినలేదా నేను ఇప్పటి వరకు తొంభై తొమ్మిది సింహాలను తిన్నాను” అని అన్నది ఎవరు ? – మేకపోతు
error: Content is protected !!