✳ నేటి ప్రత్యేకత :
▪ ప్రపంచ పేపర్ సంచుల దినోత్సవం
✳ అంతర్జాతీయ వార్తలు
▪ అమెరికా అధ్యక్ష ఎన్నికలలో భాగంగా జరిగిన రెండు జాతీయ సర్వేలలో ప్రస్తుత అధ్యక్షుడు పై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ స్వల్ప ఆదిత్యం సాధించారు.
▪ ఎర్ర సముద్రంలో అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించి హుతి రెబల్స్ నుండి మార్లిన్ లువాండా అనే నౌకను రక్షించిన భారతీయ కెప్టెన్ అహిలాశ్ రావత్ ఆయన సిబ్బందికి అంతర్జాతీయ నౌకా రవాణా సంఘం (ఐఎంఓ)-2024 అవార్డు లభించింది.
▪ రష్యా తో చైనా బంధం మరింతగా బలపడుతుండడంపై అమెరికా రాజధాని వాషింగ్టన్ లో శిఖరాగ్ర సదస్సు ముగిసిన అనంతరం నాటో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది.
✳ జాతీయ వార్తలు
▪ నీట్ యూజీ-2024 పరీక్షలో అవకతవకలకు ఆధారాలు లేవని, పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని, ఈ నెల మూడవ వారంలో కౌన్సిలింగ్ ప్రారంభిస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది.
▪ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడి తనను అరెస్టు చేయడానికి సవాల్ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది.
▪ అస్సాంలో ప్రభుత్వ ఉద్యోగులు తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో సరదాగా సమయం గడపడానికి నవంబర్ నెలలో రెండు రోజులపాటు ప్రత్యేక క్యాజువల్ సెలవును ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.
▪ బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేట్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోపరేషన్ (బిమ్ స్టిక్) సదస్సు నిన్న ఢిల్లీలో ప్రారంభం అయింది.
▪ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యు ఎన్ ఎస్ సీ) ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) వంటి అంతర్జాతీయ పాలక వ్యవస్థలను సంస్కరించి మరింత ప్రజాస్వామ్య యుతంగా తీర్చిదిద్దాలని రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో నిన్న జరిగిన బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్ 10 వా సమావేశంలో పాల్గొన్న లోక్సభ స్పీకర్ ఓన్ బిర్లా పిలుపునిచ్చారు.
▪ సైన్యంలో పనిచేసిన మాజీ అగ్ని వీర్ లకు కేంద్ర పారామెలిటరీ బలగాలలో 10% రిజర్వేషన్లు కల్పించనున్నట్లు సి ఐ ఎస్ ఎఫ్, బి ఎస్ ఎఫ్, సీ ఆర్ పి ఎఫ్ ప్రకటించాయి.
▪ మే నెలలో నిర్వహించిన సి ఏ చివరి సిఏ ఇంటర్ పరీక్షల ఫలితాలను ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐ సి ఏ ఐ) నిన్న విడుదల చేసింది.
▪ విద్యార్థుల నుంచి అక్రమంగా వసూలు చేసిన రూ 65 కోట్ల ఫీజులను తిరిగి చెల్లించాలని 10 ప్రైవేటు పాఠశాలల కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
▪ తొలిసారిగా మణిపూర్ కు చెందిన జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ పేరును సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజెఐ) జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం సిఫార్సు చేసింది.
▪ సుప్రీంకోర్టు ఏర్పడి 75 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా రూ 75 వెండి నాణెం విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
▪ చైనా నుంచి పాకిస్తాన్ కు ఎగుమతి అవుతున్న నిషేధిత రసాయనాలను తమిళనాడు పోర్టులో భారత భద్రతా సంస్థలు నిన్న స్వాధీనం చేసుకున్నాయి.
▪ రెండవ నేషనల్ జ్యుడీషియల్ పే కమిషన్ (ఎస్ఎన్ జె పి సి) సిఫార్సులను అమలు చేయని 16 రాష్ట్రాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
✳ రాష్ట్ర వార్తలు :
▪ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మార్గదర్శకత్వంలో విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ పునరుద్యోవానికి కృషి చేస్తామని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సందర్శించిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్ డి కుమారస్వామి తెలియజేశారు.
▪ 2026 జూన్ నాటికి భోగాపురం లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పూర్తి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియజేశారు.
▪ రాష్ట్ర ప్రభుత్వం 16 మంది ఐఏఎస్ అధికారులను 11 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రామ్ ప్రకాశ్ సిసోదియాను, పాఠశాల విద్య కమిషనర్ గా వి. విజయరామరాజును నియమించింది.
▪ రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్ జి యు కె టి) వైస్ ఛాన్సర్ గా ఉన్న కే సి రెడ్డి ని ఆ బాధ్యతలనుంచి రిలీవ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
▪ రాష్ట్రంలోని ప్రైవేటు విశ్వ విద్యాలయాలకు ఫీజులను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది.
▪ రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు కౌన్సిలింగ్ షెడ్యూల్ ను ఈ నెల 20వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది.
▪ సాంకేతిక సమస్యతో రాష్ట్రవ్యాప్తంగా ఆస్తుల క్రయవిక్రయాల దస్తావేజుల రిజిస్ట్రేషన్లు నిన్న నిలిచిపోయాయి.
▪ 2024-25 కు సంబంధించి ఆర్ జి యు కె టి పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీ ప్రాంగణాలలో ప్రవేశాలకు సంబంధించిన తుది జాబితాను నిన్న నూజివీడులో వైస్ ఛాన్సర్ విడుదల చేశారు.
▪ ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిన్న విశాఖపట్నంలోని మెడ్ టెక్ జోన్ లో రెండు కొత్త కంపెనీలను ప్రారంభించారు.
క్రీడావార్తలు :
▪ లండన్ లో జరుగుతున్న వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ లో ఇటలీకి చెందిన జాస్మిన్ పావోలిని, క్రెజికోవా లు సెమీఫైనల్స్ లో విజయాలు సాధించి ఫైనల్స్ లో ప్రవేశించారు.