నేటి వార్తలు (16.07.2024)
నేటి ప్రత్యేకత :
▪ కృత్రిమ మేథ ప్రశంశా దినోత్స వం (AI హార్ట్ LLC ఈ రోజును మే 2021లో స్థాపించింది)
▪ ప్రపంచ పాముల దినోత్సవం
అంతర్జాతీయ వార్తలు :
▪ అమెరికా అంతరిక్ష సంస్థ నా సాప్రయోగించిన లూనార్ రికానసెన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్డీ) అందించిన రాడార్ కొలతలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు చంద్రుని ఉపరితలంపై అత్యంత లోతైన బిలాన్ని గుర్తించారు.
▪ పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పి టి ఐ) దేశద్రోహానికి, జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆధారాలు లభించడంతో త్వరలో నిషేధం విధించనున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది.
▪ అమెరికా అధ్యక్ష పదవికి జరగబోయే ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డోనాల్డ్ ట్రంప్ పేరుకు మీలాక్విలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ప్రతినిధుల ఆమోదం లభించింది.
▪ తమపై రష్యా సైన్యం క్షేత్రస్థాయిలో చేస్తున్న దాడులను ఎదుర్కోవడానికి రోబోలు, డ్రోన్లు ఇతర మానవ రహిత వాహనాలను వినియోగించుకోవాలని ఉక్రెయిన్ ప్రణాళికలు రచిస్తోంది.
▪ రహస్య పత్రాలకు సంబంధించి అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై నమోదైన కేసును ఫ్లోరిడా న్యాయస్థానం నిన్న కొట్టివేసింది. నేపాల్ ప్రధానమంత్రిగా నాల్గవసారి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్- యు ఎం ఎల్ కు చెందిన కేపీ శర్మ ఓలి నిన్న ప్రమాణ స్వీకారం చేశారు.
▪ చైనా స్థూల దేశీయుత్పత్తి (జిడిపి) వృద్ధిరేటు ఈ సంవత్సరం రెండవ త్రైమాసికంలో 4.7 శాతానికి పడిపోయిందని ప్రభుత్వం నిన్న ప్రకటించింది.
▪ గత కొంతకాలంగా ఎలుగుబంట్ల సంఖ్య పెరిగిపోయి ప్రజలపై వాటి దాడులు ఎక్కువ కావడంతో తమ దేశంలోని 481 ఎలుగుబంట్లను చంపాలని రొమేనియా ప్రభుత్వం నిర్ణయించింది.
జాతీయ వార్తలు
▪ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు తనపై సిబిఐ దాఖలు చేసిన ఎఫ్ఎస్ఐఆర్ ను సవాలు చేస్తూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వేసిన పిటిషన్ ను సోమవారం సుప్రీంకోర్టు కొట్టి వేసింది.
▪ ఆధార్ (2016) మనీలాండరింగ్ (2017) వంటి చట్టాలను కేంద్ర ప్రభుత్వం ద్రవ్య బిల్లులుగా ఆమోదించడానికి వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణకు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలన్న సూచనను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలియజేసింది.
▪ నీట్ యూబీ వాదంలో తమపై దాఖలైన పిటిషన్లు అన్నిటిని ఒకే చోట విచారించేలా ఆదేశాలు ఇవ్వాలన్న జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టిఏ) విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
▪ మధ్యప్రదేశ్ లోని ప్రాచీన కట్టడం భోజ్ శాల – కమల్ మౌలా మసీదు వివాదానికి సంబంధించిన శాస్త్రీయ సర్వే నివేదికను భారత పురావస్తు విభాగం (ఏఎస్ఐ) నిన్న ఆ రాష్ట్ర హైకోర్టుకు సమర్పించింది.
▪ జాతీయ భద్రత ఉపసలహాదారుగా పనిచేస్తున్న విక్రమ్ మిస్త్రీ నిన్న విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.
▪ ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా సైనిక ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో భారత్ అమెరికాలో హిందూ మహాసముద్రంలో భారీ యుద్ధ విన్యాసాలు నిర్వహించాయి.
రాష్ట్ర వార్తలు :
▪ ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు. ఈ నెల 23 నుంచివారానికి 2 రోజులపాటు రోజుకు 2 గ్రామాల చొప్పున‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టనుంది.
▪ గత ప్రభుత్వం చేపట్టిన భూముల రీ సర్వే అమలు నిలిపివేస్తున్నట్లు త్వరలో “ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రివెన్షన్ యాక్ట్” నీ తీసుకు వస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియజేశారు.
▪ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జెడ్ ఎస్ ఐ) త్వరలో ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్ళనున్నారు ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవనున్నారు.
▪ ఈనెల 19వ తేదీన పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని దీని ప్రభావంతో రాబోయే ఐదు రోజులలో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేసింది.
▪ పశు బీమా పథకం కింద రైతులు తమ పశువులు, గొర్రెలు, మేకలు, పందులకు భీమా చేయించుకోవచ్చని పశుసంవర్ధక శాఖ సంచాలకులు ఒక ప్రకటనలో తెలియజేశారు.
▪ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన డ్వాక్రా మహిళల ఆర్థిక స్వభావం మనకు ఉన్నతి పథకం కింద ఇచ్చే వడ్డీ లేని రుణాల పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షల నుండి రూ 5 లక్షలకు పెంచింది.
▪ గ్యారెంటీ పెన్షన్ పథకం (జిపిఎస్) ప్రభుత్వ ఉత్తర్వుల గెజిట్ ను నిలిపివేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
▪ రాష్ట్రంలోని 5.30 కోట్ల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలియజేశారు.
▪ కృష్ణా జలాల పునః పంపిణీకి సంబంధించి నాలుగు వారాలలో స్టేట్మెంట్ ఆఫ్ కేసు (ఎస్ఓసి) దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ట్రైబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేష్ కుమార్ ఆదేశించారు.
క్రీడావార్తలు :
▪ కోపా అమెరికా ఫుట్బాల్ టోర్నమెంట్ లో నిన్న మియామీ లో జరిగిన ఫైనల్స్ లో అర్జెంటీనా, కొలంబియా ను 1-0 గోల్స్ తేడాతో ఓడించి 16 వ సారి ఛాంపియన్ గా నిలిచింది.
▪ ఢిల్లీలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్ లో భారత ఆటగాడు భవ్ తేగ్ ఫైనల్స్ లో ఓటమిపాలై రజత పతకం సాధించగా మహిళల ట్రాప్ విభాగంలో సబీరా కాంస్య పతకం సాధించింది.