AP TET DSC 4TH CLASS TELUGU CONTENT NOTES PART 1

By RK Competitive Adda

Published On:

 

 

 

 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

4 వ తరగతి తెలుగు – కంటెంట్ మెటీరీయల్

  1. గాంధీ మహాత్ముడు
  • ప్రక్రియ : గేయం
  • ఇతివృత్తం: మహనీయుల చరిత్ర
  • కవి : బసవరాజు అప్పారావు
  • కాలం : (13/12/1894 – 10/06/1933)
  • జాతీయోద్యమ కాలంలో వీరి గీతాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేసాయి
  • బసవరాజు అప్పారావు గేయాలు’ పేరిట వీరి గీతాలు సంపుటంగా వెలువడ్డాయి

 పదాలు – అర్థాలు :

  • స్వరాజ్యం = సొంత పాలన
  • ప్రణయ = ఓంకారం
  • మోక్షం = విడుపు, విముక్తి
  • స్వస్తి = శుభం, మంగళం
  • గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్విందీ జగత్తు – కలకల నవ్వింది – పల్లవి

తేనెల తేటల మాటలతో

  • కవి : ఇంద్రగంటి శ్రీకాంతశర్మ
  • కాలం : (29/5/1944 – 25/07/2019)
  • వీరు తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి.
  • అనుభూతి గీతాలు అనునది వీరి కవితా సంపుటి.
  • వీరు లలిత గీతకర్త, ఆకాశవాణిలో పనిచేసారు.
  • తేనెల తేటల మాటలతో అందం మన దేశమాతనే కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకొని ఇంక జీవన యానం చేయుదమా –  పల్లవి

 

తెలివైన దుప్పి

  • ఇది ఒక జాతక కథ.
  • ఉద్దేశం : మోసగాళ్ళుంటారు వాళ్ళ మాయలో పడకూడదు. ఆశ ప్రమాదాల్లోకి నెడుతుంది. జాగ్రత్తగా ఉండాలని తెలియజేయడమే
  • బోధిసత్వుడు ఒక అడవిలో దుప్పిగా జన్మించాడు. అతనికి పండ్లంటే ఇష్టం.
  1. గోపాల్ తెలివి
  • ప్రక్రియ : కథ
  • ఇతివృత్తం : సమయస్ఫూర్తి
  • పాత్రల పేర్లు : ఢిల్లీ సుల్తాను, జయచంద్రుడు (మాల్వాదేశ రాజు) గోపాల్ (విదూషకుడు)

* ఈ పాఠంలో ఢిల్లీ సుల్తాను అడిగిన వింత ప్రశ్నలు రెండు

  1. ఈ భూమి పొడుగు ఎంత ? వెడల్పు ఎంత ?

గోపాల్ :  పదహారు బండ్లలోగల పెద్ద దారపు ఉండలతో సమాధానం చెప్పాడు.

  1. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయి?

గోపాల్ :  పాతిక (25) గొర్రెలకు గల వెంట్రుకలతో సమాధానం చెప్పాడు.

పదాలు – అర్థాలు :

  • దర్బారు : రాజసభ
  • విదూషకుడు – హాస్యగాడు
  • అంబుజం = పద్మము
  • తీర్థం = పుణ్యక్షేత్రం

వ్యతిరేక పదాలు : –

  • కృతజ్ఞత X కృతఘ్నత
  • స్వార్థం. నిస్వార్థం
  • సుగుణం X దుర్గుణం

చూడగంటి

  • కవి : తాళ్ళపాక అన్నమయ్య
  • కాలం , : (09/05/1408 – 23/2/1503)
  • బిరుదు : పదకవితా పితామహుడు
  • వీరు 32 వేల సంకీర్తనలలను రాశారని ప్రతీతి.
  • వీరు శ్రీ వేంకటేశ్వరస్వామి కేంద్రంగా విశిష్ట సాహిత్యాన్ని, సంగీత సంస్కృతిని నిర్మించారు.
  • తేటతెలుగు పలుకుబడి, దేశీ పదసంపద, వాడుక భాషలోని అపురూప మాధురి అన్నమయ్య కవిత్వంలో పొంగి పొర్లుతుంటాయి.
  • పల్లవి : కంటి నఖలాండ కర్త నధికుని గంటి కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తిగంటి

పదాలు – అర్థాలు :

  • రాగం = బృందావని
  • తాళం = ఖండ

విందు

* ఈ పాఠంలో ఒక రోజు సూర్యుడు, చంద్రుడు, వాయువు విందుకెళ్ళారు. వాళ్ళ తల్లి నక్షత్రం వాళ్ళు ఎప్పుడు తిరిగి వస్తారా అని ఆమె ఎదురు చూడసాగింది.

* సూర్యుడు, వాయువు తల్లి గురించి ఆలోచించకుండా విందులో వడ్డించినవన్నీ కడుపునిండా తిన్నారు కానీ చంద్రుడు తన తల్లి కోసం కొన్ని పదార్థాలను మూటకట్టి తెచ్చాడు

* “నాయనా! నాకోసం ఏమి తెచ్చారు మీరు” అని ఎవరు అడిగారు ? – నక్షత్రం (తల్లి)

* వాళ్ళు పెట్టింది స్నేహితులతో ఆస్వాదించానే తప్ప నువ్వు గుర్తుకు రాలేదమ్మా! – సూర్యుడు

* నేను సుష్టుగా భోంచేయడానికి విందుకి వెళ్ళాను తప్ప నీకోసం ఏదో ఒకటి తేవాలనుకోలేదు” అని ఎవరు అన్నారు? – వాయువు

* “నీ కోసం అత్యంత రుచికరమైన పదార్థాలను తెచ్చాను. నేను విందులో ఏ పదార్థం తింటున్నా నువ్వే గుర్తుకు వచ్చావు” అని అన్నదెవరు ? – చంద్రుడు

  1. దేశమును ప్రేమించుమన్నా
  • ప్రక్రియ : గేయం
  • ఇతివృత్తం : దేశభక్తి
  • కవి : గురజాడ వెంకట అప్పారావు
  • కాలం : (21/09/1862 – 30/111915)
  • రచనలు : పూర్ణమ్మ, కన్యక, దేశభక్తి, లవణరాజు కల, తోకచుక్కలు (గేయాలు), మీ పేరేమిటి?, దిద్దుబాటు, మెటిల్డా, సంస్కర్త హృదయం, మతము – విమతము, పుష్పలావికలు (కథానికలు), కొండుభట్టీయం, బిల్హణీయం (అసంపూర్ణనవల), కన్యాశుల్కం (నాటకం)
  • వీరు ఆధునిక తెలుగు కవిత్వానికి, సాహిత్యానికి మార్గదర్శకులు.
  • వీరు యుగకర్త, కవి, కథకులు, నాటకకర్త, చరిత్రకారులు, శాసన పరిశోధకులు అన్నిటికన్నా ముఖ్యంగా భాషావేత్త,
  • తెలుగు సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశ పెట్టి చిరస్మరణీయమైన రచనలు చేశారు.
  • కన్యాశుల్కం నాటకం ఆధునిక తెలుగు సాహిత్యంలోఅత్యంత విశిష్ట రచన.

దేశమును ప్రేమించుమన్న

మంచి అన్నది పెంచుమన్నా

ఒట్టిమాటలు కట్టిపెట్టోయ్

గట్టి మేల్ తలపెట్టవోయ్

* శివాజీ తండ్రి పేరు – శంభోజి

పదాలు – అర్థాలు :

  • ఒట్టి = ఏమి లేని
  • కద్దు = కలదు, ఉన్నది
  • చెట్టపట్టాలు = ఒకరి చేతిని మరొకరు పట్టుకోవడం
  • యశము – కీర్తి

గేయం ఆధారంగా జతపరచడం :

  • తిండి కలిగితే- కండ కలదోయ్
  • ఒట్టి గొప్పలు చెప్పుకోకోయ్
  • చెట్టపట్టాల్ – కట్టుకొని
  • ఒట్టిమాటలు – కట్టిపెట్టాయ్
  • పొరుగువారికి – తోడుపడవోయ్

తెలుగు తల్లీ

  • కవి : పిల్లలమర్రి వెంకట హనుమంతరావు
  • కాలం : 07/05/1921 – 13/09/1989
  • రచనలు : సాహిత్య సంపద, ఆంధ్రాభ్యుదయం, కాపుపాటలు
  • వీరు సాహిత్య వ్యాసాలు, కథలు, ఏకాంకికలు, ఖండ కావ్యాలు రచించారు.

తేనె పలుకుల తెలుగు తల్లీ!

రవల వెలుగుల తెలుగుతల్లీ!

శాతవాహన శకము లోపల

శాంతి పాఠము నేర్పితమ్మా! –  పల్లవి

కందిరీగ కిటుకు

  • కవి : డా|| రావూరి భరద్వాజ
  • కాలం : 05/07/1927 – 18/10/2013
  • జన్మస్థలం : గుంటూరు జిల్లా తాడికొండ
  • రచనలు : విమల (తొలికథ) అవరిచితులు కథాసారము వంటి 37 కథా సంపుటాలు, ఉడతమ్మ ఉపదేశం, కీలుగుర్రం వంటి పకపక 43 పిల్లల కథలు, పాకుడు రాళ్ళు,నడవడం కరిమ్రింగిన వెలగపండు, జలప్రళయం సెలయేరు వంటి 17 నవలలు.
  • పురస్కారాలు : జ్ఞానపీఠ పురస్కారం, కళాప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సోవియట్ భూమినెహ్రూ పురస్కారం రాజాలక్ష్మీ ఫౌండేషన్ అవార్డు, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, కళారత్న, లోకనాయక్ ఫౌండేషన్ పురస్కారం.
  • వీరి పాకుడు రాళ్ళు నవలకుగాను 2012 లో జానపీఠ పురస్కారం లభించింది
  • ఏనుగుకు ఎవరు గుణపాఠం చెప్పారు – కందిరీగ
  • పాత్రలు : సింహం, ఏనుగు, కందిరీగ
  1. పరివర్తన
  • ప్రక్రియ : కథ
  • ఇతివృత్తం: పిల్లల స్వభావం
  • పాత్రల పేర్లు : రాము, కాకి, తేనెటీగ, చీమ
  • ఈ పాఠంలో రాముకు బద్దకం ఎక్కువ. చదువంటే శ్రద్ధ తక్కువ.
  • “రానున్నది వానాకాలం అసలే నాకు గూడు లేదు ఒక్కొక్క పుల్లను తెచ్చుకొని శ్రమించి గూడు కట్టుకుంటున్నాను. – కాకి
  • నాకు అంత తీరిక లేదు. పూల నుంచి తేనెను సేకరిస్తున్నాను, పూలు తొందరగా వాడిపోతాయి. నాకు చాలా పని ఉంది – తేనెటీగ (తుమ్మెద)
  • “ఇప్పుడు కష్టపడి గింజలు దాచుకుంటే అప్పుడు సుఖంగా ఉండొచ్చు .” అని అన్నదెవరు? – చీమ
  • నేనెందుకు బడికి వెళ్ళకుండా ఇలా వ్యర్థంగా నేను బడికి వెళతాను – రాము

పదాలు – అర్థాలు :

  • పరివర్తన మార్పు
  • ఆత్మీయంగా ప్రేమగా
  • చిన్న బుచ్చుకొను = నిరాశపడు
  • రాయంచ = రాజహంస

పడవ నడపవోయి

  • కవి : వింజమూరి శివరామారావు
  • కాలం : 1908-1982
  • జన్మస్థలం : తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం దగ్గర చంద్రపాలెం
  • రచనలు : గోర్కి కథలు ; కల్పవల్లి (ఖండకావ్యసంపుటి)
  • బిరుదు : కళాప్రపూర్ణ
  • తరగలు = అలలు
  • చక్కని రాయంచనంచు చుక్కల తళుకెంచుకొంచు – ఇందులో అంత్యాను ప్రాసాలంకారం ఉంది
  • పడవ నడపవోయి పూలపడవ నడపవోయి – పల్లవి

ఉపాయం

  • ఈ పాఠం మహాభారత ఇతిహాసం లోనిది.
  • పాత్రలు : భీష్ముడు, ద్రోణాచార్యుడు, భీముడు, అర్జునుడు
  • ఈ కథ ఉద్దేశ్యం : మన ప్రతిభాపాటవాలే మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయి తిరుగుతున్నాను. అని తెలియజేయడమే.
  • బంతిని గట్టిగా ఎవరు తన్నారు? – భీముడు
  • భరత వంశీయులకు విలువిద్య గురువుగా ఎవరిని ఎంచుకొన్నారు? – ద్రోణాచార్యుడుని
  • ద్రోణాచార్యుడిని గురువుగా ఉండమని ఎవరు కోరారు ? – భీష్ముడు

RK Competitive Adda

RK Competitive Adda అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉద్యోగాలు మరియు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వెబ్‌సైట్. మేము తాజా నోటిఫికేషన్లు, ఉద్యోగ సమాచారాలు, మరియు క్విజ్‌లను అందిస్తున్నాము.

1 thought on “AP TET DSC 4TH CLASS TELUGU CONTENT NOTES PART 1”

  1. సార్ ఒక మంచి ఆలోచన తో ప్రారంభించి మంచి పని చేసారు సార్ online లో వందలు, వేలు పెట్టిన దొరకని మెటీరియల్ మీరు ఉచితంగా అందిస్తున్నందుకు ధన్యవాదములు online exam కుడా పెడితే బాగుంటుంది సార్

Comments are closed.

error: Content is protected !!