AP TET DSC 4TH CLASS TELUGU CONTENT NOTES PART 2

  1. సత్య మహిమ
  • ప్రక్రియ : గేయకథ
  • ఇతివృత్తం : నైతిక విలువలు
  • కవి : అవధాని రమేష్
  • కాలం : 20వ శతాబ్దం
  • జన్మస్థలం : కర్నూలు జిల్లా అవుకు
  • తల్లిదండ్రులు : సావిత్రమ్మ, సుబ్రహ్మణ్యశాస్త్రి
  • రచనలు : కాసుల పేరు, ప్రతీకారం, మూడు మంచి కథలు
  • మన నిజాయితీ, సత్యవ్రతాలే మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం
  • సత్య మహిమ పాఠ్యాంశం వీరి గుజ్జనగూళ్ళు అనే రచన నుండి తీసుకోబడినది.

పదాలు – అర్థాలు:

  • అకలంక : మచ్చలేని, చెడుగుణాలు లేనట్టి
  • సత్యవ్రతంబు = ఎల్లవేళలా నిజం చెప్పే వ్రతం
  • తత్తరం : గాబరా
  • మొగంబు = ముఖం
  • వన్నె = అందం, రంగు
  • గతి = జీవితం నడిచే విధానం
  • మోము = ముఖం
  • ఆర్తి = దు:ఖం
  • దీనత = దారిద్ర్యం
  • మిరుమిట్లు = మెరుగులు
  • మిసిమి = నూతన కాంతి
  • చెన్ను = అందం

పదాల ఆధారంతో కొత్త పదం కనుక్కోవడం :

  • క్షీరాన్నం = పాయసము
  • ఒక శరీర భాగం = పాదము
  • పుణ్యం కానిది = పాపము
  • రాయి = పాషాణము
  • పక్క భాగం = పార్శ్వము
  • బెల్లంతో చేసేది = పానకము

 

కన్నడ గేయం

  • ఓచెలువన……. ఆముద్దిన……… చెలువిన ముద్దిన మక్కలే – పల్లవి
  • ఈ కన్నడ గేయం NCERT పాఠ్యపుస్తకం నుండి తీసుకోబడినది.

 

ఏ కాలుది నేరం ?

  • ఏ కాలుది నేరం అనే కథ మర్యాద రామన్న కథలలోనిది.
  • పిల్లిని నలుగురు అన్నదమ్ములు పెంచుతున్నారు.
  • పిల్లి నాలుగు కాళ్ళను నలుగురూ పంచుకొని అలంకరించారు.
  • నాల్గవవాడు పెంచుకున్న పిల్లి కాలికి దెబ్బ తగిలిందిమర్యాద రామన్న తీర్పు ఏమంటే! మిగిలిన ముగ్గురూ కలిసి నాల్గవవాడికి నష్టపరిహారం ఇవ్వాలని.

 

  1. ముగ్గుల్లో సంక్రాంతి
  • ప్రక్రియ : వ్యాసం
  • ఇతివృత్తం : సంస్కృతీ – సంప్రదాయాలు
  • పాత్రలు : అనూష, ఆదిత్య, అత్తమ్మ
  • సంక్రాంతి పండుగ మూడు రోజులపాటు జరుగుతుంది.
  • మొదటి రోజు – భోగి
  • రెండవరోజు – సంక్రాంతి
  • మూడవరోజు – కనుమ
  • భోగిరోజు పిల్లలకు రేగుపళ్ళు, శెనగలు, చెరుకు ముక్కలు, చిల్లర డబ్బులు, బంతిపూల రేకులు కలిపి భోగిపళ్ళు పోస్తారు
  • సంక్రాంతి రోజు బొమ్మల కొలువు పెడతారు, కోడిపందాలు, పొట్టేళ్ళ పందాలు, ఎడ్లబండి పరుగు వంటి పోటీలు నిర్వహిస్తారు.
  • కనుమను పశువుల పండుగ అని కూడా అంటారు. ఆ రోజు పశువులను ప్రత్యేకంగా అలంకరించి పూజిస్తారు.
  • రథం ముగ్గు అనేది సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయనానికి ప్రయాణ సూచికగా చెబుతారు.
  • ముస్లింలు జరుపుకునే పండుగలలో పవిత్రమైన పండుగ : రంజాన్. దీన్ని ఈద్ అని ఈద్ – ఉల్ – ఫితర్ అని కూడా అంటారు.
  • ఈ పండుగ ఇస్లాం కేలండర్ ప్రకారం రంజాన్ నెల మొదటి రోజున ప్రారంభమవుతుంది.
  • ఈ రోజు రాత్రి చంద్ర దర్శనం కాగానే మసీదుల్లో తరావీ నమాజ్ అనే ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.
  • రంజాన్ నెల అంతా ఉపవాసాలు ఉంటారు. సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందే భోజనం చేస్తారు. దీనిని సహరి అంటారు
  • సూర్యాస్తమయం తరువాత ఉపవాస దీక్ష విరమిస్తారు. దీనిని ఇఫ్తార్ అంటారు.
  • జకాత్ చేస్తారు. జకాత్ అంటే సంవత్సరానికి ఒకసారి వారి ఆదాయం సంపదపై ఒక లెక్క ప్రకారం పేదలకు దానధర్మాలు చేయడం.
  • రంజాన్ నెల చివరి రోజున చంద్ర దర్శనంతో “షవ్వాల్” నెల మొదలవుతుంది. మరునాడు పెద్ద ఎత్తున ఈద్ పండుగ జరుపుకుంటారు.
  • ముస్లింలు ‘ఈద్ గ్లాహ్ కి వెళ్ళి సామూహిక ప్రార్థనలు చేసారు.

పదాలు – అర్థాలు :

  • రాశి = నక్షత్రాల గుంపు
  • ఆయనం : గమనం
  • కలశం : చిన్న కుండ లేదా చిన్న చెంబు

జాతీయాలు :

  • మట్టి మనుషులు – శ్రామికులు, శ్రమజీవులు
  • మట్టిలో పుట్టిన = ప్రాంతంలో జన్మించిన
  • మట్టిలో కలిసిపోవడం = మరణించడం
  • మట్టిపాలైన = వృథా అయిన
  • మన్ను తిన్న పాములాగ = కదలక మెదలక
  • నోట్లో మట్టి కొట్టడం = అన్యాయం చేయడం
  • తలవంపులు = అగౌరవం
  • తలపండిన = విశేష అనుభవం గడించిన
  • తలలో నాలుక = అరమరకలు లేకుండా కలసిపోవడం
  • తలదూర్చడం = జోక్యం చేసుకోవడం
  • విశేషణం : ఒక వాక్యంలో నామవాచకం యొక్క రంగు, రుచి, స్థితి మొదలైన గుణాలను తెలియజేసే పదాలను విశేషణాలు అంటారు.
  • వాక్యంలో విశేషణం సాధారణంగా నామవాచానికి ముందు వస్తుంది. క్రింది ఉదహారణాలు చూడండి
  • ఇది అందమైన నెమలి
  • రమ పచ్చని గాజులు కొన్నది
  • ఇది తియ్యని మామిడి పండు
  • అరిసెలు కమ్మని వంటకం

 

గొబ్బిళ్ళ పాట

  • ఇది ఒక సంప్రదాయ జానపద గేయం.
  • గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో చందమామ ఓ చందమామ – పల్లవి
  • గొబ్బిళ్ళ పాటలో జాంవిత్తు, జాంపువ్వు జాంపండు గురించి చెప్పబడింది

 

నకిలీ కన్ను

  • ఇది నసీరుద్దీన్ కథలలోనిది.
  • ఇందలి పాత్రలు : మౌల్వీ నసీరుద్దీన్ (ధనికుడు)
  • ధనికుడి లోభం, దరిద్రుని దానం అనునది ఒక సామెత
  • “నా కళ్ళలో ఏది నకిలీ కన్ను కనుక్కో చందా ఇస్తాను” అని ఎవరు అన్నారు? – ధనికుడు

 

  1. పద్యరత్నాలు
  • ప్రక్రియ : పద్యాలు
  • ఇతివృత్తం : నైతిక, మానవీయ విలువలు
  • ధనము కూడబెట్టి దానంబు సేయక……. వేమన (వేమన శతకం)
  • పుత్రోత్సాహము తండ్రికి ………. బద్దెన (సుమతీ శతకం)
  • పరుల కొరకె నదులు ప్రవహించు……. జంధ్యాల పాపయ్యశాస్త్రి (తెలుగుబాల శతకం)
  • బలవంతుడు నాకేమని …………. బద్దెన (సుమతీ శతకం)
  • మొదలు చూచిన కడుగొప్పి పిదప కుఱచ .. ఏనుగు లక్ష్మణకవి (సుభాషిత రత్నావళి)
  • ఎంత చెలిమి యున్న ఎగతాళి చేయకు ……… నార్ల చిరంజీవి (తెలుగుపూలు శతకం)
  • మతములెన్నియున్న మాతవత్వ మ్మొక్కటే … నార్ల వెంకటేశ్వరరావు (నార్ల వారి మాట శతకం)
  • బ్రతుకవచ్చుగాక బహుబంధనము లైన ……. పోతన
  • పూజకన్న నెంచబుద్ది ప్రధానంబు ……… వేమన

పదాలు – అర్థాలు:

  • మిక్కిలి ఎక్కువగా = బాగుగా
  • పరమార్ధము = నిజమైన ప్రయోజనం
  • దినపూర్వ = ఉదయకాలం
  • విరసం = అనిష్టం
  • లేమి = పేదరికం
  • మానధనులు = పరువు కలిగినవారు
  • బావుటా = పతాకం
  • తెఱువరి = బాటసారి
  • నిగ్రహించు = ఎదురించి
  • తనరు = వర్టిల్లు
  • జీవధనం = ప్రాణం

తమాషా వాక్యాల్లోని జవాబులు కనిపెట్టండి

  • వడను తినే వడ – దవడ
  • రోజాలను పెట్టుకొనే రోజాలు – శిరోజాలు
  • జనాలు తినే జనం – భోజనం
  • ఖండాలు, దేశాలు లేని పటం – గాలిపటం
  • ప్రేమను పంచే కారం – మమకారం
  • తాగలేని పాలు – పాపాలు

 

వీరగంధం

  • కవి : త్రిపురనేని రామస్వామి చౌదరి
  • కాలం : 15/01/1887 – 16/01/1943
  • రచనలు : సూతపురాణం, పల్నాటి పౌరుషం
  • బిరుదు : కవిరాజు

పల్లవి :  వీరగంధము తెచ్చినారము

వీరుడెవ్వడో తెల్పుడీ

పూసిపోదుము మెడను వైతుము

పూలదండలు భక్తితో.

 

పేను-నల్లి

  • ఈ కథ పరవస్తు చిన్నయసూరి రచించిన నీతి చంద్రికలోనిది
  • “నువ్వు నాకు మంచి స్నేహితుడవు. నిన్ను ఒకటి అడగాలని వచ్చాను.” ఈ మాటలు ఎవరు అన్నారు? – నల్లి, పేనుతో
  • నువ్వు నాకు ప్రాణంతో సమానం అని పేను, నల్లితో అన్నది.
  1. బారిష్టర్ పార్వతీశం
  • ప్రక్రియ : కథనం ప్రధాన
  • ఇతివృత్తం: హాస్యం
  • కవి : మొక్కపాటి నరసింహశాస్త్రి
  • కాలం : 09/10/1892 – 05/03/1973
  • జన్మస్థలం: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం
  • రచనలు : బారిష్టరు పార్వతీశం, మొక్కుబడి, అభ్యుదయం, పెదమామయ్య
  • బారిష్టరు పార్వతీశం తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధిచెందిన హాస్య నవల.
  • వేమూరి పార్వతీశం స్వస్థలం నరసాపురం దగ్గర మొగలితుర్రు.
  • పార్వతీశం టెయిలర్ హైస్కూల్ లో అయిదో ఫారము వరకు చదువుకున్నాడు.
  • స్నేహితుని సలహాతో పార్వతీశం ఇంగ్లాండు వెళ్ళి బారిష్టరు. చదవాలని నిశ్చయించుకున్నాడు.
  • ఈ పాఠ్యాంశం ఉత్తమ పురుష కథనంలో కలదు.
  • సామాన్లు గొలుసుకు కట్టినందుకు పార్వతీశానికి ఎంత జరిమానా కట్టమన్నారు? – 50 రూపాయలు
  • ఆడవాళ్ళు పెట్టుకొనే టోపీని ఎక్కడ కొన్నాడు?- చెన్నపట్నం
  • కొలంబోకి పార్వతీశం స్టీమరు మీద వెళ్ళాడు.

పదాలు – అర్థాలు :

  • ఐదవసారము = 10వ తరగతి (నేటి)
  • కచ్చికలు = కాల్చిన పిడకలు
  • చాదు = పిండితో తయారు చేసిన బొట్టు
  • బస = తాత్కాలిక నివాసం
  • కేకి = నెమలి
  • బారిష్టరు = ఇంగ్లండులో న్యాయశాస్త్రం చదువుకున్నవాడు
  • అంగవస్త్రం – తువ్వాలు
  • దేశవాళీ దువ్వెన = చెక్కతో చేసిన దువ్వెన
  • సూకరం = పంది.
  • చెన్నపట్నం = మద్రాసు, చెన్నై
  • దొరసాని తెల్లజాతి స్త్రీ
  • బంట్రోతు = సేవకుడు

నక్షత్రాలు – రాశులు –  కార్తెలు :

* నక్షత్రాల సంఖ్య – 27

* ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాల చొప్పున 27 నక్షత్రాలకు 108 పాదాలని వాటిని 9 పాదాలకు ఒక రాశిచొప్పున 12 రాశులుగ విభజించారు.

* మన ప్రాచీన రైతులు వ్యవసాయ విజ్ఞానాన్ని, సూర్యమాన, చంద్రమాన ఆధారంగా పొందుపరిచారు.

* సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ కార్తె పేరు పెట్టారు.

* సంవత్సరానికి 27 కార్తెలు.

కార్తెలకు సంబంధించిన సామెతలు :

* రోహిణీ కార్తెలో రోళ్ళు పగులుతాయి.

* అశ్విని కురిస్తే అంతా నష్టం

* భరణిలో చల్లిన నువ్వు చేను కాయకు బరిగెడు గింజలు.

* నాన్న నన్నెననిన నేను నాన్నననను – వృత్త్యనుప్రాసాలంకారం

 

ఏరువాక పాట

  • కవి : బిరుదురాజు రామరాజు
  • కాలం : 16/04/1925 – 08/02/2010
  • జన్మస్థలం : వరంగల్ దగ్గర దేవనూరు గ్రామం
  • రచనలు: జానపద రామాయణం, తెలుగు సాహిత్యోద్దారకులు .
  • ఏరువాకొచ్చింది ఏరువాకమ్మ నల్లని మబ్బుల నల్దక్కులపారి. ………… పల్లవి
  • తెలుగు జానపద గేయసాహిత్యంపై మొట్టమొదటగా పరిశోధన చేసినది ఎవరు ? – బిరుదురాజు రామరాజు

 

అత్యాశ

  • ఈ కథ పంచతంత్రంలోనిది.
  • ఆశ అతిగా మారితే అన్నీ కావాలనుకుంటారు. ఉన్నవాటితో సర్దుకోలేరు ఆ ప్రయత్నంలో ఆలోచన లేకుండా ప్రవర్తించి ప్రమాదం కొని తెచ్చుకుంటారని తెలపడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం.
  • సూకరం = పంది
  1. రాజు-కవి
  • ప్రక్రియ : పద్యకథ
  • ఇతివృత్తం : సామాజిక అంశం
  • పాత్రలు: రవి, తాతయ్య
  • కవి : గుర్రం జాషువా
  • కాలం : (28/09/1895 – 24/07/1971)
  • స్వస్థలం : గుంటూరు జిల్లా వినుకొండ

* రచనలు : వీరదౌసి, గబ్బిలము, క్రీస్తు చరిత్ర, ముంతాజ్ మహల్, స్వప్నకథ, బాపూజీ, నేతాజీ, నాకథ.

* బిరుదులు : కవికోకిల, కవితావిశారద, నవయుగ కవి చక్రవర్తి, కళాప్రపూర్ణ

* ప్రశస్తమైన పద్యం శిల్పం, లలితమైన ధార, దళితులు అట్టడుగు వర్గాలపట్ల అపారమైన ప్రేమ, సామాజిక అసమానతలపట్ల ఆగ్రహం జాషువా కవిత్వ లక్షణాలు.

* వీరి క్రీస్తు చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

 

పాఠంలోని అంశాలు :

* రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు సుకవి చేతి కలము సుధలు గురియు – గుర్రం జాషువా

* జీతమిచ్చి రాజు సేవింపబడుచుండు జీతమీక సుకవి సేవలందు – గుర్రం జాషువా

* ఈ పాఠం జాషువా రచించి “పిరదౌసి” పీఠిక నుంచి తీసుకోబడిన ఒక అంశం.

* ఒకనాడు గజనీ మహమ్మద్ నిండు కొలువులో మహాకవియైన “పిరదౌసి”ని పిలిచి తన విజయ యాత్రలను గ్రంథంగా రచించమన్నాడు. పద్యానికి ఒక బంగారు నాణెం ఇస్తానన్నాడు కవి సరేనన్నాడు.

* 30 సం||లు శ్రమించి అరవైవేల పద్యాలతో “షానామా” అనే గ్రంథం రచించాడు. పిరదౌసికవి సభా మధ్యంలో రాజుగారికి అందజేశాడు. కాని రాజు బంగారు నాణేలకు బదులు వెండి నాణేలు ఇచ్చాడు.

* భాదపడిన కవి రాజుగారిని నిందిస్తూ కొన్ని పద్యాలు రాశాడు. రాజు తప్పు గ్రహించి బంగారు నాణేలు పంపాడు.

పదాలు – అర్థాలు :

  • సౌధం భవనం
  • గండవితతిమయం – రాళ్ళతో నిండినది
  • ప్రబలటం – ఎక్కువ కావటం
  • రుచిమయం = కాంతితో నిండినది
  • ఇహం= ఈ లోకం

 

వెయ్యేళ్ళ కవినోయ్

  • కవి : అడవి బాపిరాజు
  • కాలం : (15/01/1887 – 16/01/1943)
  • రచనలు : నారాయణరావు, హిమబిందు, గోనగన్నారెడ్డి, శశికళ, గంగిరెద్దు

* ఈయన కవి, నవలాకారుడు, కథకుడు, చిత్రకారుడు.

* ఈ గేయంలో ఆంధ్రకవిగా ఎవరిని కీర్తించారు.- మహాకవి. భవభూతి.

 

దెబ్బకు దెబ్బ

* ఇది ఒక నీతి కథ.

* మోసాన్ని మోసంతోనే జయించాలని తెలియజేయడమే ఈ కథ ఉద్దేశం.

* వ్యాపారి కట్టెలను రైతు దగ్గర ఎంతకు కొన్నాడు ? – 20 రూపాయలు

ఈ విదంగా మీరు ప్రతి సబ్జెక్టు మెటీరీయల్ మీకు కావాలి అనుకుంటే మన rkcompetitiveadda.com వెబ్సైట్ ను SUBSCRIBE చేసుకోగలరు

error: Content is protected !!