ఉత్తర ఛత్తీస్‌గఢ్ & పొరుగున ఉన్న అల్పపీడన ప్రాంతం ఇప్పుడు తూర్పు మధ్యప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న ఛత్తీస్‌గఢ్‌పై ఉంది. అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ వరకు విస్తరించి ఎత్తుకు వెళ్ళేకొలది ఆగ్నేయ దిశగా వంగి ఉంటుంది. సగటు సముద్ర మట్టం వద్ద రుతుపవన ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, అజ్మీర్, గుణ, అల్పపీడన ప్రాంత కేంద్రం తూర్పు మధ్యప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న ఛత్తీస్‌గఢ్, చంద్‌బాలీ, ఆగ్నేయ ప్రాంతాల మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు వెళుతుంది. సగటు సముద్రంపై 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించినది. షీర్ జోన్ లేదా గాలుల కొత ఇప్పుడు దాదాపు 21° ఉత్తర అక్షాంశం వెంబడి సముద్ర మట్టానికి 3.1 & 7.6 కి.మీల మధ్య ఎత్తుకు వెళ్ళేకొలది దక్షిణం వైపు వంగి ఉంటుంది. ఈ క్రమంలో రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందా
కోస్తా ఆంధ్ర ప్రదేశ్ ;-
సోమవారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షము కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉన్నది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటరుల వేగముతో వీచే అవకాకాశముంది.
మంగళవారం, బుధవారం:- తేలికపాటి నుండి మోస్తరు వర్షము కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటరుల వేగముతో వీచే అవకాకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ ;-
సోమవారం, మంగళవారం, బుధవారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షము ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
రాయలసీమ :
సోమవారం, మంగళవారం, బుధవారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షము ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.