నేటి ప్రత్యేకత :
▪ భారత స్వాతంత్రోద్యమ నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి(1906)
అంతర్జాతీయ వార్తలు :
▪ డెమొక్రటిక్ పార్టీ మద్దతుతో అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తానని దేశాన్ని ఐక్యం చేసి ట్రంప్ ను ఓడిస్తానని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలహారిస్ తెలియజేశారు.
▪ పర్యాటకుల తాకిడి తట్టుకోలేక స్పెయిన్ లోని మల్లోర్కా ప్రాంతంలో స్థానికులు నిరసన ప్రదర్శన చేపట్టారు.
▪ పెన్సిల్వేనియాలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ పై కాల్పుల సంఘటన సీక్రెట్ సర్వీస్ తీవ్ర వైఫల్యమైన అని ఆ సంస్థ డైరెక్టర్ కింబర్లీ కియాటిల్ అంగీకరించారు.
▪ బంగ్లాదేశ్ లో పరిస్థితి అదుపు తప్పకుండా ప్రభుత్వం సోమవారాన్ని సెలవు దినంగా ప్రకటిస్తూ వరుసగా 5వ రోజు ఇంటర్నెట్ ను నిలిపివేసింది.
▪ గాజా లోని ఖాన్ యూనిస్ లోని సురక్షిత ప్రాంతాల నుంచి ఖాళీ చేయాలని పాలస్తీనియన్లను సోమవారం ఇజ్రాయిల్ సైన్యం ఆదేశించింది.
▪ క్రొయేషియా లోని డారువర్ పట్టణంలో ఒక వృద్ధాశ్రమంలోకి ప్రవేశించిన దుండగుడు కాల్పులు జరపడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
▪ తమ దేశ భద్రతకు ముప్పు వాటిలితే చైనాలోని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కి చెందిన లేజర్లతో కూడిన జలాంతర్గముల ద్వారా స్టార్ లింక్ శాటిలైట్లను ధ్వంసం చేస్తామని చైనా ప్రకటించింది.
జాతీయ వార్తలు
▪ ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ నిన్న పార్లమెంటులో ఆర్థిక సర్వే 2023-24 ప్రవేశపెట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 6.5% నుంచి 7% మధ్య ఉండవచ్చని అంచనా వేసింది.
▪ 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్ ను నేడు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వరుసగా ఏడవసారి లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు.
▪ వైద్య విద్య కోర్సుల కోసం నిర్వహించే జాతీయ ప్రవేశ పరీక్ష (నీట్) ను వ్యతిరేకిస్తూ కర్ణాటక రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తీర్మానం ఆమోదించింది.
▪ కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించేవారు తమ యజమానుల పేర్లను తప్పనిసరిగా ఆహారశాలలపై ప్రదర్శించాలన్న ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
▪️హిందుత్వ సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యక్రమాలలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడంపై 58 ఏళ్ల క్రితం విధించిన నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది.
▪ భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌక ఐ ఎన్ ఎస్ బ్రహ్మపుత్ర ముంబైలోని డాక్ యార్డులో మరమ్మత్తుల నిర్వహణలో ఉండగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుని ఓ పక్కకు ఒరిగిపోయింది.
▪ నీట్ యూజీ 2024 పరీక్ష పత్రం లీకేజీ అవకతవకలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నిన్న విచారణ ప్రారంభించింది.
▪ బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని లోక్సభలో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
రాష్ట్ర వార్తలు :
▪ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిన్న ప్రారంభం కాగా రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నిన్న ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.
▪ అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ఆదివారం రాత్రి కొందరు దుండగులు తగలబెట్టిన సంఘటనలో కీలక కంప్యూటర్లు దస్తాలు కాలిపోయాయి.
▪ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడినప్పటికీ ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడంతో నేడు రేపు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేసింది.
▪ ఎన్నికల విధులకు ముందు తహసిల్దార్లు పనిచేసిన అదే నియోజకవర్గంలో వారిని మళ్లీ నియమించవద్దని రెవెన్యూ శాఖ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
▪ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు మెడికల్ రీయంబర్స్మెంట్ పథకాన్ని ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
▪ పోలవరం తొలి దశ పనులను వేగంగా పూర్తి చేయడానికి రూ.12,157 కోట్ల విడుదలకు కేంద్ర క్యాబినెట్ ముందు ప్రతిపాదనలు ఉంచనున్నట్లు కేంద్ర జల్ శక్తి మంత్రి సి.ఆర్ పాటిల్ తెలియజేశారు.
▪ రాష్ట్రంలోని శ్రీకాకుళం విజయనగరం కర్నూలు జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్) లను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం (ఎన్ ఈ పి) కింద ఉపాధ్యాయ విద్య బలోపేతానికి రాష్ట్రాలకు నిధులు విడుదల చేసింది.
▪ ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాలలో అగ్రీ డిప్లమా కోర్సులలో ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు జరగనుందని రిజిస్ట్రార్ తెలియజేశారు.
క్రీడా వార్తలు :
▪ ఒలింపిక్ ఉద్యమానికి చేసిన గొప్ప సేవలకు గాను అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓఏ) భారత షూటింగ్ ఆటగాడు అభినవ్ బింద్రా కు ఒలింపిక్ ఆర్డర్ అవార్డు ప్రకటించింది.
▪ భారత పురుషుల క్రికెట్ జట్టుకు చీఫ్ కోచ్ గా నియమితులైన గౌతమ్ గంభీర్ నిన్న పదవీ బాధ్యతలు చేపట్టాడు.
5 th ఆన్లైన్ టెస్ట్