AP GRAMA VOLUNTEERS JOBS 2024 LATEST NEWS TODAY

By RK Competitive Adda

Published On:

 

 

 

 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

వాలంటీర్ల వ్యవస్థపై ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం.

ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా గౌరవ సిఎం చంద్రబాబు సర్కార్ కసరత్తు చేస్తోంది. వాలంటీర్ల వ్యవస్థకు న్యూ లుక్ తేవాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు.వాలంటీర్ల సేవలను మరింత సమర్ధవంతంగా వినియోగించుకోవాలని సర్కారు భావిస్తోంది. వాలంటీర్ల కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ డెవలప్‌మెంట్ మీద ప్రభుత్వం దృష్టి సారిస్తోంది వాలంటీర్ల విద్వార్హతలు.. వయస్సుల వారీ వివరాలను సేకరిస్తోంది.

  • వాలంటీర్లల్లో పీజీ చేసిన వాళ్లు 5 శాతం ఉండగా.. డిగ్రీ చేసిన వాళ్లు 32 శాతం.. డిప్లొమా చేసిన వాళ్లు 2 శాతం.. ఇంటర్ పూర్తి చేసిన వాళ్లు 48 శాతం 10వ తరగతి చదివిన వారు 13 శాతంగా ఉన్నట్టు గుర్తించారు.
  • వయస్సుల వారీగా చూస్తే.. 20 నుంచి 25 మధ్యలో వయస్సు ఉన్న వారు 25 శాతం.. 26 నుంచి 30 వయస్సు ఉన్నవారు 34 శాతం.. 31 నుంచి 35 ఏళ్ల మధ్య – 28 శాతం మంది వాలంటీర్లు ఉన్నట్లు తెలిసింది.
  • వాలంటీర్లకు స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి సామర్థ్యాలను పెంచాలని కొత్త సర్కారు ప్రణాళికలను రచిస్తోంది.
  • వాలంటీర్ల స్కిల్స్ పెంచి.. వీరి ద్వారానే మరిన్ని సేవలు ప్రజలకు అందించేలా ప్లాన్ చేస్తోంది.
  •  పరిమిత సంఖ్యతోనే వాలంటీర్ల వ్యవస్థ కొనసాగించాలని ఎన్డీఏ ప్రభుత్వ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

వచ్చే క్యాబినెట్ సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.ప్రస్తుతం ప్రభుత్వ లెక్కల్లో 1,53,908 మంది వాలంటీర్లు ఉన్నట్లు తెలిసింది. ఈ ఏడాది మార్చి-మే కాలంలో 1,09,192 మంది వాలంటీర్లు రాజీనామా/తొలగింపు జరిగింది. ప్రస్తుతమున్న వారితో నెలకు రూ.10 వేల గౌరవ వేతనం చెల్లించాలంటే ఎంత మేరకు ఖర్చు
అవుతుందనే అంశంపై ప్రభుత్వం లెక్కలేస్తోంది.వాలంటీర్ల గౌరవ వేతనం నిమిత్తం ఏటా రూ. 1848 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు సమాచారం

RK Competitive Adda

RK Competitive Adda అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉద్యోగాలు మరియు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వెబ్‌సైట్. మేము తాజా నోటిఫికేషన్లు, ఉద్యోగ సమాచారాలు, మరియు క్విజ్‌లను అందిస్తున్నాము.

error: Content is protected !!