Ap Govt Work From Home Jobs Registration
నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల గ్రామ సచివాలయ ఉద్యోగుల ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరిపిస్తున్నారు అయితే ఈ సర్వే లో భాగంగా మీ ఇంటి వద్దకే వచ్చి మిమ్మల్ని సచివాలయ ఉద్యోగి క్రింద ఇవ్వబడిన ఈ ప్రశ్నలకు అడగడం జరుగుతుంది అయితే వారికి మీరు intrested అని వాటికి జవాబులు సరిగ్గా చెబితే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది
ఎవరు అర్హులు ?
18-50 వయస్సు ఉన్న మీ దగ్గరకి సర్వే చేస్తున్నపడు వచ్చి మీ పేరు ఉంది ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేస్తున్నం అని చెబితే మీరూ అర్హులే అయితే మీకు ఇంకా సర్వే చేశారో లేదో తెలియకపోతే మీ గ్రామ వార్డు సచివాలయం కు వెళ్ళి ఇలా మాకు సర్వే చేశారా అని అడిగి తెలుసుకోండి
ఉచిత కుట్టు మిషన్ ఎలా అప్లై చేయాలి ? II AP Free Sewing Machine Scheme 2025 Apply Online
1. మీకున్న విద్యార్హత ఏమిటి ?
2. ప్రస్తుతం ఏదైనా పని చేస్తున్నారా లేదా ?
3. పని చేస్తున్నట్లయితే వర్క్ ఫ్రం హోం సదుపాయం ఉన్నటువంటి ఏ రంగంలో పనిచేస్తున్నారు. ?
4. వర్క్ ప్రొఫైల్ కింద ఇంటి వద్ద నుండి పనిచేస్తున్నారా ? ఆఫీస్ వద్ద నుండి పనిచేస్తున్నారా ? లేదా హైబ్రిడ్ మోడల్ లో కొంతకాలం ఇంటి వద్ద కొంతకాలం ఆఫీన్ లో పనిచేస్తున్నారా ?
5. ఇంటి వద్ద నుండి పనిచేస్తున్నట్టయితే మీ ఇంటిలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ ఉన్నదా ?
6. వర్క్ ఫ్రొం హోమ్ అవకాశం ఉన్నట్టయితే మీ ఇంటిలో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అవకాశం ఉందా ?
7. బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఉంటే మీకు ఎంత స్పీడ్ తో ఇంటర్నెట్ సదుపాయం ఉంది ?
8. మీ ఇంట్లో వర్క్ ఫ్రం హోం కింద మీ స్నేహితులకు లేదా మీ కొలీగ్ మీ తోటి ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సదుపాయం కొరకు ఇంట్లో ప్లేస్ లేదా సపరేట్గా రూమ్ ఉన్నదా ? ఉంటే ఆ రూమ్ యొక్క కొలత?
9. ఎంతమంది వరకు వర్క్ ఫ్రం హోం కింద ఆ రూమ్ లో పనిచేయటం అవకాశం ఉంటుంది ?
10. ప్రస్తుతం పని చేయకపోతే ఏదైనా ఫీల్డ్ లో పనిచేయుటకు ఇష్టం ఉన్నదా ?
11. పనిచేయటం ఇష్టం ఉంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ హాజరు అవుతారా ?
సర్వేలో ప్రశ్నలు అన్ని అయిన తర్వాత చివరిలో మీరు Thumb లేదా సర్వే చేస్తున్న వారికి మొబైల్ నెంబర్ ఉన్నట్టయితే వెరిఫికేషన్ OTP ద్వారా ఇలా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి