RBI Assistant Notification 2026 : డిగ్రీ అర్హతతో ఆర్బీఐలో 650 ఉద్యోగాలు – పూర్తి వివరాలు ఇవే!
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్బీఐ కార్యాలయాల్లో 650 అసిస్టెంట్ (Assistant) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన అర్హతలు, పరీక్ష విధానం, జీతం మరియు దరఖాస్తు వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.
Also Read
RBI Assistant Notification 2026 – ముఖ్యమైన తేదీలు (Important Dates)
| అంశం | తేదీలు |
| ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం | 16 ఫిబ్రవరి 2026 |
| దరఖాస్తుకు చివరి తేదీ | 08 మార్చి 2026 |
| ప్రిలిమ్స్ పరీక్ష (Preliminary Exam) | 11 ఏప్రిల్ 2026 (Tentative) |
| మెయిన్స్ పరీక్ష (Main Exam) | 07 జూన్ 2026 (Tentative) |
RBI Assistant Notification 2026 – ఖాళీల వివరాలు (Vacancies)
- మొత్తం ఖాళీలు: 650.
- హైదరాబాద్ (RBI Hyderabad) రీజియన్‌లో ఖాళీలు: 11 (వీటిలో SC-2, OBC-5, EWS-3, GEN-1 ఉన్నాయి).
విద్యార్హతలు (Eligibility Criteria – As on 01/02/2026)
- విద్య: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్స్ డిగ్రీ (Bachelor’s Degree) కలిగి ఉండాలి. డిగ్రీలో కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి (SC/ST/PwBD అభ్యర్థులు పాస్ అయితే సరిపోతుంది).
- కంప్యూటర్ నాలెడ్జ్: అభ్యర్థులకు పీసీ (PC)లో వర్డ్ ప్రాసెసింగ్ నాలెడ్జ్ ఉండాలి.
- స్థానిక భాష: అభ్యర్థి ఏ రీజియన్‌కు అప్లై చేస్తున్నారో, ఆ రాష్ట్రం యొక్క స్థానిక భాష (చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడం) తెలిసి ఉండాలి. ఉదాహరణకు, హైదరాబాద్ రీజియన్‌కు అప్లై చేసేవారికి తెలుగు తప్పనిసరిగా రావాలి.
RBI Assistant Notification 2026 – వయోపరిమితి (Age Limit – As on 01/02/2026)
- అభ్యర్థుల వయస్సు 20 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
- అభ్యర్థులు 02/02/1998 కంటే ముందు మరియు 01/02/2006 తర్వాత జన్మించి ఉండకూడదు.
- వయో సడలింపు (Age Relaxation):
- SC/ST: 5 సంవత్సరాలు.
- OBC: 3 సంవత్సరాలు.
- PwBD: 10 సంవత్సరాలు (GEN/EWS).
RBI Assistant Notification 2026 – జీతం (Salary)
ఎంపికైన అభ్యర్థులకు నెలకు ప్రారంభ బేసిక్ పే రూ. 29,000/- ఉంటుంది. అలవెన్సులతో కలుపుకొని చేతికి సుమారుగా రూ. 58,514/- (HRA లేకుండా) జీతం వస్తుంది.
ఎంపిక విధానం (Selection Process)
ఎంపిక మూడు దశల్లో ఉంటుంది:
- ప్రిలిమినరీ పరీక్ష (Preliminary Examination)
- మెయిన్ పరీక్ష (Main Examination)
- లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (LPT – స్థానిక భాష పరీక్ష).
పరీక్ష విధానం (Exam Pattern)
1. ప్రిలిమ్స్ (Preliminary Exam) – 100 మార్కులు
- English Language: 30 ప్రశ్నలు – 30 మార్కులు (20 నిమిషాలు)
- Numerical Ability: 35 ప్రశ్నలు – 35 మార్కులు (20 నిమిషాలు)
- Reasoning Ability: 35 ప్రశ్నలు – 35 మార్కులు (20 నిమిషాలు)
- గమనిక: ప్రతి తప్పు సమాధానానికి 0.25 (1/4th) మార్కు కోత ఉంటుంది.
2. మెయిన్స్ (Main Exam) – 200 మార్కులు
- Reasoning, English, Numerical Ability, General Awareness, Computer Knowledge అనే 5 విభాగాల నుండి మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. సమయం 135 నిమిషాలు.
RBI Assistant Notification 2026 – దరఖాస్తు రుసుము (Application Fee)
- SC/ST/PwBD/Ex-Servicemen: రూ. 50/- (ప్లస్ 18% GST).
- GEN/OBC/EWS అభ్యర్థులు: రూ. 450/- (ప్లస్ 18% GST).
RBI Assistant Notification 2026 – దరఖాస్తు చేయడం ఎలా?
అర్హత గల అభ్యర్థులు RBI అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ మార్చి 08, 2026.
మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవండి.
Download Notification – Click here
Apply Online – Click here
Official Website – Click here