Annadata Sukhebhava Ekyc status ఇలా చెక్ చేసుకోండి
అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 98 శాతం ఈకేవైసీ పూర్తి. భూమి లేని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కౌలు రైతులు లబ్ధి పొందాలంటే కౌలు గుర్తింపు కార్డు పొందాలని, ఇ-పంటలో నమోదవ్వాలని అధికారులు తెలిపారు.
Nirudyogi Bruthi Apply Online 2025
అర్హులను ఎలా గుర్తించారు :
రెవిన్యూ వెబ్‌ల్యాండ్‌లో భూయజమానుల డేటా ఈ సమాచారాన్ని “అన్నదాత సుఖీభవ” పోర్టల్ ద్వారా గ్రామస్థాయిలో వెరిఫికేషన్ చేసి రాష్ట్రస్థాయిలో ధృవీకరించగా 47.77 లక్షల రైతు కుటుంబాలు అర్హులుగా గుర్తించిన సంగతి తెలిసిందే. వీరి వివరాలు e-KYC ఈకేవైసీ కోసం రైతు సేవా కేంద్రాలకు పంపగా ఇప్పటివరకు 98% e-KYC పూర్తయింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా 61,000 మందికి e-KYC చేయాల్సి ఉంది. సొంత భూమి కలిగిన డి-పట్టాదారులు, అసైన్డ్ భూములు, ఇనాం భూములు కలిగిన రైతులు కూడా పథకానికి అర్హులు.
Ekyc స్టేటస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కౌలు రైతులు లబ్ధి పొందాలంటే :
1. కౌలు గుర్తింపు కార్డు పొందాలి
2. ఇ-పంట లో నమోదవ్వాలి
అర్హతల ప్రకారం వీరికి కూడా లబ్ధి అందించబడుతుంది. కౌలు రైతులకు మొత్తం లబ్ధి గతంలో మాదిరిగానే రెండు విడతలుగా అక్టోబర్, జనవరిలో అందించబడుతుంది.
PM KISAN డబ్బు ఖాతాలో పడిందో లేదో చెక్ చేసుకోండిలా
తొలుత పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ను సందర్శించాలి కుడి వైపు ఆప్షన్లలో బెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్ ఉంటుందిసెలక్ట్ చేసుకున్న తర్వాత ఆధార్ లేదా ఖాతా నంబర్ నమోదు చేసి‘గెట్ డేటా’పై క్లిక్ చేయాలి అయితే స్టేటస్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఒకవేళ మీరు పీఎం కిసాన్‌కు రిజిస్టర్ చేసుకుని…ఈ-కేవైసీ పూర్తైతే నగదు జమ అవుతుంది. అంతేకాదు లబ్ధిదారుల జాబితాలో పేరు ఉందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు బెనిఫిషియరీ స్టేటస్ కింద బెనిఫిషియరీ లిస్ట్ ఆప్షన్ ప్రత్యక్షమవుతుంది.ఈ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే మరొక పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. రాష్ట్రం..జిల్లా…ఉప జిల్లా….బ్లాక్ ఎంచుకుని గెట్ రిపోర్ట్‌పై క్లిక్ చేస్తే చాలు జాబితా, లబ్ధిదారుల పేర్లు కనిపిస్తాయి.