Ap Bc Corporation Subsidy Loans Apply Online 2025
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఏపీలో బీసీ , ఇబిసి, కమ్మ, రెడ్డి, ఆర్య వైశ్య, క్షత్రియ మరియు బ్రాహ్మణ కులములకు తీపి వార్త.
2024-25 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బి.సి. కార్పోరేషన్, ఇబిసి, కమ్మ, రెడ్డి, ఆర్య వైశ్య, క్షత్రియ మరియు బ్రాహ్మణ కార్పోరేషన్లకు సంబంధించిన లబ్ధిదారులకు బిసి కార్పోరేషన్, విజయనగరం వారి ద్వారా వివిధ పథకముల ద్వారా సబ్సిడీ మంజూరు చేయుటకు గాను, దరఖాస్తుదారులు AP-OBMMS ద్వారా వారి పేరును ఆన్లైన్ లో నమోదు చేసుకొనుటకు తేదీ 30.01.2025 నుండి 12.02.2025 వరకు అవకాశం కల్పించబడినది.
వివరాలు :
- బీసీ కార్పోరేషన్
- ఇబిసి కార్పోరేషన్
- కమ్మ కార్పోరేషన్
- రెడ్డి కార్పోరేషన్
- ఆర్య వైశ్య కార్పోరేషన్
- క్షత్రియ కార్పోరేషన్
- బ్రాహ్మణ కార్పోరేషన్
ఎవరెవరు అర్హులు ?
బిసిలందరూ దరఖాస్తు చేసుకొనవచ్చును.అలాగే ఇబిసి కుల ధృవ పత్రం కలిగిన ఓసి కమ్యూనిటీ వారు, కమ్మ కుల ధృవ పత్రం కలిగిన ఓసి కమ్యూనిటీ వారు, రెడ్డి కుల ధృవ పత్రం కలిగిన ఓసి కమ్యూనిటీ వారు, ఆర్య వైశ్య కుల ధృవ పత్రం కలిగిన ఓసి కమ్యూనిటీ వారు, క్షత్రియ కుల ధృవ పత్రం కలిగిన ఓసి కమ్యూనిటీ వారు, బ్రాహ్మణ కుల ధృవ పత్రం కలిగిన ఓసి కమ్యూనిటీ వారు.
- బీసీ కార్పోరేషన్, ఇబిసి, కమ్మ, రెడ్డి, ఆర్య వైశ్య, క్షత్రియ మరియు బ్రాహ్మణ కార్పోరేషన్ల ద్వారా సబ్సిడీ ఋణముల మంజూరుకు నియమ నిబంధనలు
- అన్ని వనరులు కలుపుకుని పట్టణ ప్రాంతము వారి ఆదాయము రూ.1,03,000/- మరియు గ్రామీణ ప్రాంతము వారి ఆదాయము రూ.81,000/- లేదా అంతకంటే తక్కువగా ఉండవలెను.
- 21 నుండి 60 సం. ల మధ్య వయసు గలవారు అర్హులు.
- తెల్ల రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం మరియు ఆదార్ కార్డు తప్పనిసరిగా కలిగి యుండవలెను.
- ఒక కుటుంబము యొక్క తెల్ల రేషన్ కార్డు నందు ఒక్కరు మాత్రమే లబ్ది పొందుటకు అర్హులు.
RRB Group D Notification 2025 Full Details In Telugu 10th Pass Railway Jobs 2025
వ్యవసాయ సంబంధ కార్యక్రమాలు, పరిశ్రమలు, చిన్న తరహా వ్యాపారము, సేవలు, రవాణా విభాగము వంటి సెక్టార్లకు సంబందించిన యూనిట్లకు సబ్సిడీ మంజూరు చేయబడును.
ముఖ్య గమనిక :
పైన తెలిపిన విధంగా అర్హతలు కలిగిన వారు htpps://apobmms.dev.nidhi.apcfss.in/ వెబ్సైటు (ఆన్లైన్ ) నందు తేదీ 30-1-2025 నుండి 12-02-2025 లోగా వారి వారి పేర్లను AP-OBMSS వెబ్సైటు నందు నమోదు చేసుకోవాలి.
ఇలాంటి పథకాలు సమాచారం మీరు ప్రతి రోజు తెలుసుకోవాలి అనుకుంటే మన వాట్సప్ టెలిగ్రామ్ ఛానెల్స్ లో Join అవ్వగలరు ధన్యవాదములు