ఏపీ మహిళలకు ఇవి ఉంటేనే ఉచిత బస్ ప్రయాణం

By RK Competitive Adda

Updated On:

 

 

 

 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

ఏపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. మెగా డీఎస్సీ  ,పెన్షన్లు, , ఉచిత ఇసుక వంటి హామీలు అమలు చేసిన ప్రభుత్వం మరో కీలక హామీ అమలుకు సిద్ధమైంది.మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుకు ముహూర్తం ఖరారు చేసింది ఏపీ ప్రభుత్వం.

ఆగస్టు 15న విశాఖపట్నం లో ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. అదే రోజున అన్న క్యాంటీన్లను కూడా ప్రారంభించనున్నట్లు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.

జూలై 16న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఉచిత బస్సు పథకం అమలు దిశగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.మహిళలకు ఏ కేటగిరీ బస్సుల్లో ఈ అవకాశం కల్పించాలనే దాని పైన అధికారులు తుది కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రూట్లలోనూ ఈ పథకం అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే, ప్రస్తుతం ఉన్న బస్సులతో ఈ పథకం అమలు చేస్తే ఇబ్బందులు తప్పవని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారని సమాచారం. కొత్త బస్సులు తీసుకొనే వరకూ పథకం వాయిదా వేయాలనే సూచనలు చేశారు అధికారులు. అయితే, ప్రభుత్వం మాత్రం పథకం అమలు వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మరి, అనుకున్న సమయానికి ఉచిత బస్సు పథకం అమల్లోకి వస్తుందా లేదా అన్నది వేచి చూడాలి

RK Competitive Adda

RK Competitive Adda అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉద్యోగాలు మరియు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వెబ్‌సైట్. మేము తాజా నోటిఫికేషన్లు, ఉద్యోగ సమాచారాలు, మరియు క్విజ్‌లను అందిస్తున్నాము.

error: Content is protected !!