ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఆరు హామీలు ఇవ్వడం జరిగినది అందులో యువతకు నిరుద్యోగ భృతి ఉద్యోగాలు రాని నిరుద్యోగులకు ప్రతినెల 3 వేల రూపాయలు చెల్లిస్తామని ప్రకటించడం జరిగింది అయితే ఈ పథకం గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే పెంచిన పెన్షన్లు, మెగా డీఎస్సీ, ఉచిత ఇసుక వంటి హామీలు అమలు చేసిన ప్రభుత్వం మరో కీలక హామీ అమలుకు సిద్ధమైంది.
ఈ పధకం పొందడానికి అర్హతలు ?
- ప్రైవేటు గాని ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు
- స్కాలర్షిప్ పొందేవారు అనర్హులు
- పిఎఫ్ అకౌంట్ ఉండకూడదు
- తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగి ఉండాలి
- ఐదు ఎకరాల కన్నా తక్కువ భూమి కలిగి ఉండాలి
- డిప్లొమా/డిగ్రీ లేదా పీజీ చేసిన వారు అర్హులు
- 20 నుండి 35 సంవత్సరాలు వయసు ఉండాలి
- నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు
- కుటుంబంలో ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదు
- ఎటువంటి పెన్షన్ పొందకుండా ఉండాలి
ఈ పధకం పొందడానికి ఏ సర్టిఫికేట్స్ కావాలి ?
- ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి
- బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డుకు లింక్ అయి ఉండాలి
- ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ మరియు మార్క్స్ షీట్స్ కావాలి
- ఈమెయిల్ ఐడి కావాలి
అప్లై చేయు విధానం ?
నిరుద్యోగ భృతి పథకానికి సంబంధించి మనం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే ఆన్లైన్లో మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఇంకా స్టార్ట్ కాలేదు కావున పైన తెలిపిన పత్రాలు అన్ని సిద్ధంగా ఉంచుకొని రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిన వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి