AP TET DSC 3RD CLASS TELUGU CONTENT NOTES PART 1

By RK Competitive Adda

Published On:

 

 

 

 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

3 వ తరగతి తెలుగు – కంటెంట్ న్యూ సిలబస్  

  1. తెలుగు తల్లి
  • ప్రక్రియ : గేయం
  • ఇతివృత్తం : దేశభక్తి
  • కవి : శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ)
  • కాలం : (14/4/1910 – 15/6/1983)
  • రచనలు : మహాప్రస్థానం, మరో ప్రస్థానం, ఖడ్గసృష్టి
  • స్వీయచరిత్ర : అనంతం
  • శ్రీశ్రీ మహాప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన.
  • శ్రీశ్రీ అభ్యుదయ యుగకర్త, మహాకవి.

తల్లీ భారతి వందనము

  • రచయిత : దాశరథి కృష్ణమాచార్యులు
  • కాలం : (22/7/1925 – 5/11/1981)
  • రచనలు : అగ్నిధార, రుద్రవీణ, మహాంద్రోదయం,తిమిరంతో సమరం.
  • స్వీయచరిత్ర : యాత్రా స్మృతి
  • నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా ఉన్నారు

ఐకమత్యం

  • రచయిత : లియోటాల్ స్టాయ్
  • కాలం : (09/09/1828 – 20/11/1910)
  • రచనలు : సమరం-శాంతి, ఆనాకెరినినా (నవలలు)
  • ఉద్దేశ్యం : రామాపురం అనే గ్రామంలో ఉండే రైతు తన ముగ్గురు కుమారులకు ఐకమత్యం గొప్పతనాన్ని పుల్లలకట్ట సహాయంతో తెలియజేయడమే ఈ కథ ఉద్దేశ్యం.
  • ఐకమత్యం కథకు టాల్ స్టాయ్ కథ ఆధారం.
  • టాల్ స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి పొందిన రష్యన్ కథకులు.
  1. మర్యాద చేద్దాం
  • ప్రక్రియ : కథ
  • ఇతివృత్తం : హాస్యం
  • మూలం : పరమానందయ్య కథ
  • పాత్రలు : పరమానందయ్య, పేరయ్య అనే పండితుడు, శిష్యులు
  • పూర్వం కళింగ రాజ్యంలో పరమానందయ్య అనే పండితుడు ఉండేవాడు.
  • పరమానందయ్యకు 12 మంది శిష్యులు.
  • పరమానందయ్య ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు సంఖ్య – .
  • ఒకరోజు పరమానందయ్యగారు భార్యతో కలసి గుడికి వెళ్ళారు.
  • సమయానికి నువ్వు రాకపోతే చంపేవారుగా పరమా అని పేరయ్య అనే పండితుడు పరమానందయ్యతో అన్నాడు.
  • * “ఒరేయ్ మన ఇంటికి వచ్చే అతిథుల్ని గౌరవించి మర్యాదలు చెయ్యాలి” అని ఎవరు చెప్పారు? – పరమానందయ్య శిష్యులతో.
  • పాపం వాళ్ళకేమి తెలియదు క్షమించు – పేరయ్య,పరమానందయ్యతో అన్నాడు.
  • పరమానందయ్యగారు భార్యతో కలిసి పొరుగూరు పేరయ్య కూతురు పెళ్ళికి వెళ్ళారు.

రేలా…. రేలా….

  • ఇది ఒక జానపద గేయం.
  • అడవి తల్లికి దండాలో – మాతల్లి అడవికి దండాలో అడవి చల్లంగుంటే – అన్నానికి కొదవేలేదు. అనే పంక్తులు గల పాఠం – రేలా… రేలా..
  • ఏటిలోన ఊట చూడు నీటిలోన సుడులు చూడు – ఈ పంక్తులు ఈ గేయంలోనివి.
  •  పావురాల జంట చూడు పాలపిట్ట పాట చూడు – రేలా… రేలా..

జింక

  • ఇది ఒక ఈసఫ్ కథలు.
  • ఈసఫ్ కథలు గ్రీకు పురాణ కథలు, ఇవి 2500 సంవత్సరాల నాటివి.
  • ఈ కథలు అన్ని ప్రపంచ భాషలలోకి అనువదించబడ్డాయి.
  • ఈ పాఠంలో జింక కొమ్ములు కొమ్మలకు తగులుకొని ఇరుక్కుపోయాయి.
  1. మంచి బాలుడు
  • ప్రక్రియ : గేయకథ
  • ఇతివృత్తం : సహానుభూతి
  • కవి : ఆలూరి బైరాగి
  • కాలం : (05/11/1925 – 09/09/1978)
  • రచనలు : చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమగీతి, దివ్యభవనం.
  • కష్టాలలో ఉన్నవారికి సాయం చెయ్యని మనిషి జీవితం వ్యర్థం అని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశ్యం.
  • తళ తళ మిల మిల మెరుపులు మెరసి సూరున, జోరున వర్షం కురిసి – అనే మాటలతో ప్రారంభమయ్యే పాఠం – మంచి బాలుడు.
  • “దుర్బలులకు సాయం చేయని యెడ కొరగా దెందుకు మనుజుని మనుగడ” – మంచి బాలుడు.
  • 20 శతాబ్దపు అగ్రశ్రేణి కవులలో “ఆలూరి బైరాగి” ఒకరు
  • మానవుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించారు.
  • ఈయన “ఆగమగీతి” రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు.
  • తళ తళ, మిల మిల, గడగడ, కిలకిల, గణ గణ వంటి పదాలను అనుకరణ పదాలు అంటారు.

కలపండి చేయి చేయి

  • కవి : దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి
  • కాలం : (01/11/1897 – 24/02/1980)
  • రచనలు : కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసము
  • కవిత్వ లక్షణాలు : అక్షర రమ్యత, భావనా సౌకుమార్యం ,శబ్ద సంస్కారం
  • పురస్కారం : పద్మభూషణ్

వీరు ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వ యుగానికి తలుపులు తెరిచారు. అచ్చమైన తెలుగుకవి. వీరి కవిత్వాన్ని శ్రీశ్రీ ఇక్షు సముద్రంతో పోల్చారు.

  • కొండ రాళ్లు పగలగొట్టి కోన చదును చేద్దాం కోన వెంట దారితీసి రాదారులు వేద్దాం – ఈ గేయం కలపండి చేయి చేయి
  • పాడుకుంటు పనిచేస్తే పదిమందికి లాహిరి ఆడుకుంటూ పనిచేస్తే అనిపించదు చాకిరి – కలపండి చేయి చేయి
  • ఈ గేయంలో కవి ప్రస్తావించిన ఊర్లు – కలకత్తా, కాశ్మీరం, కాశీ, కన్యాకుమారి

బావిలో నీళ్ళు

  • ఇది ఒక అక్బర్ – బీర్బల్ కథ.
  • ఇందలి పాత్రలు : అక్బర్ (రాజు), బీర్బల్ (మంత్రి), రైతు(జమీందారు)
  • ఈ పాఠంలో జమీందారు రైతుకు బావి అమ్మాడు.
  • నేనే నీకు బావిని అమ్మాను కానీ అందులో నీటిని కాదు అని జమీందారు రైతుతో అన్నాడు.
  • “సరే నువ్వు బావి ఒక్కటే అమ్మావు, నీళ్ళు అమ్మలేదు కదా! అని అన్నది ఎవరు? – బీర్బల్, జమీందారుతో.
  •  రైతు బావిలో నీ నీళ్ళన్నీ ఉన్నాయి. వెంటనే నీ నీళ్ళన్నీ తోడుకొని వెళ్ళిపో అని ఎవరు అన్నారు? – బీరల్ జమీందారుతో

RK Competitive Adda

RK Competitive Adda అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉద్యోగాలు మరియు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వెబ్‌సైట్. మేము తాజా నోటిఫికేషన్లు, ఉద్యోగ సమాచారాలు, మరియు క్విజ్‌లను అందిస్తున్నాము.

error: Content is protected !!