4 వ తరగతి తెలుగు – కంటెంట్ మెటీరీయల్
- గాంధీ మహాత్ముడు
- ప్రక్రియ : గేయం
- ఇతివృత్తం: మహనీయుల చరిత్ర
- కవి : బసవరాజు అప్పారావు
- కాలం : (13/12/1894 – 10/06/1933)
- జాతీయోద్యమ కాలంలో వీరి గీతాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేసాయి
- బసవరాజు అప్పారావు గేయాలు’ పేరిట వీరి గీతాలు సంపుటంగా వెలువడ్డాయి
పదాలు – అర్థాలు :
- స్వరాజ్యం = సొంత పాలన
- ప్రణయ = ఓంకారం
- మోక్షం = విడుపు, విముక్తి
- స్వస్తి = శుభం, మంగళం
- గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్విందీ జగత్తు – కలకల నవ్వింది – పల్లవి
తేనెల తేటల మాటలతో
- కవి : ఇంద్రగంటి శ్రీకాంతశర్మ
- కాలం : (29/5/1944 – 25/07/2019)
- వీరు తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి.
- అనుభూతి గీతాలు అనునది వీరి కవితా సంపుటి.
- వీరు లలిత గీతకర్త, ఆకాశవాణిలో పనిచేసారు.
- తేనెల తేటల మాటలతో అందం మన దేశమాతనే కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకొని ఇంక జీవన యానం చేయుదమా – పల్లవి
తెలివైన దుప్పి
- ఇది ఒక జాతక కథ.
- ఉద్దేశం : మోసగాళ్ళుంటారు వాళ్ళ మాయలో పడకూడదు. ఆశ ప్రమాదాల్లోకి నెడుతుంది. జాగ్రత్తగా ఉండాలని తెలియజేయడమే
- బోధిసత్వుడు ఒక అడవిలో దుప్పిగా జన్మించాడు. అతనికి పండ్లంటే ఇష్టం.
- గోపాల్ తెలివి
- ప్రక్రియ : కథ
- ఇతివృత్తం : సమయస్ఫూర్తి
- పాత్రల పేర్లు : ఢిల్లీ సుల్తాను, జయచంద్రుడు (మాల్వాదేశ రాజు) గోపాల్ (విదూషకుడు)
* ఈ పాఠంలో ఢిల్లీ సుల్తాను అడిగిన వింత ప్రశ్నలు రెండు
- ఈ భూమి పొడుగు ఎంత ? వెడల్పు ఎంత ?
గోపాల్ : పదహారు బండ్లలోగల పెద్ద దారపు ఉండలతో సమాధానం చెప్పాడు.
- ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయి?
గోపాల్ : పాతిక (25) గొర్రెలకు గల వెంట్రుకలతో సమాధానం చెప్పాడు.
పదాలు – అర్థాలు :
- దర్బారు : రాజసభ
- విదూషకుడు – హాస్యగాడు
- అంబుజం = పద్మము
- తీర్థం = పుణ్యక్షేత్రం
వ్యతిరేక పదాలు : –
- కృతజ్ఞత X కృతఘ్నత
- స్వార్థం. నిస్వార్థం
- సుగుణం X దుర్గుణం
చూడగంటి
- కవి : తాళ్ళపాక అన్నమయ్య
- కాలం , : (09/05/1408 – 23/2/1503)
- బిరుదు : పదకవితా పితామహుడు
- వీరు 32 వేల సంకీర్తనలలను రాశారని ప్రతీతి.
- వీరు శ్రీ వేంకటేశ్వరస్వామి కేంద్రంగా విశిష్ట సాహిత్యాన్ని, సంగీత సంస్కృతిని నిర్మించారు.
- తేటతెలుగు పలుకుబడి, దేశీ పదసంపద, వాడుక భాషలోని అపురూప మాధురి అన్నమయ్య కవిత్వంలో పొంగి పొర్లుతుంటాయి.
- పల్లవి : కంటి నఖలాండ కర్త నధికుని గంటి కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తిగంటి
పదాలు – అర్థాలు :
- రాగం = బృందావని
- తాళం = ఖండ
విందు
* ఈ పాఠంలో ఒక రోజు సూర్యుడు, చంద్రుడు, వాయువు విందుకెళ్ళారు. వాళ్ళ తల్లి నక్షత్రం వాళ్ళు ఎప్పుడు తిరిగి వస్తారా అని ఆమె ఎదురు చూడసాగింది.
* సూర్యుడు, వాయువు తల్లి గురించి ఆలోచించకుండా విందులో వడ్డించినవన్నీ కడుపునిండా తిన్నారు కానీ చంద్రుడు తన తల్లి కోసం కొన్ని పదార్థాలను మూటకట్టి తెచ్చాడు
* “నాయనా! నాకోసం ఏమి తెచ్చారు మీరు” అని ఎవరు అడిగారు ? – నక్షత్రం (తల్లి)
* వాళ్ళు పెట్టింది స్నేహితులతో ఆస్వాదించానే తప్ప నువ్వు గుర్తుకు రాలేదమ్మా! – సూర్యుడు
* నేను సుష్టుగా భోంచేయడానికి విందుకి వెళ్ళాను తప్ప నీకోసం ఏదో ఒకటి తేవాలనుకోలేదు” అని ఎవరు అన్నారు? – వాయువు
* “నీ కోసం అత్యంత రుచికరమైన పదార్థాలను తెచ్చాను. నేను విందులో ఏ పదార్థం తింటున్నా నువ్వే గుర్తుకు వచ్చావు” అని అన్నదెవరు ? – చంద్రుడు
- దేశమును ప్రేమించుమన్నా
- ప్రక్రియ : గేయం
- ఇతివృత్తం : దేశభక్తి
- కవి : గురజాడ వెంకట అప్పారావు
- కాలం : (21/09/1862 – 30/111915)
- రచనలు : పూర్ణమ్మ, కన్యక, దేశభక్తి, లవణరాజు కల, తోకచుక్కలు (గేయాలు), మీ పేరేమిటి?, దిద్దుబాటు, మెటిల్డా, సంస్కర్త హృదయం, మతము – విమతము, పుష్పలావికలు (కథానికలు), కొండుభట్టీయం, బిల్హణీయం (అసంపూర్ణనవల), కన్యాశుల్కం (నాటకం)
- వీరు ఆధునిక తెలుగు కవిత్వానికి, సాహిత్యానికి మార్గదర్శకులు.
- వీరు యుగకర్త, కవి, కథకులు, నాటకకర్త, చరిత్రకారులు, శాసన పరిశోధకులు అన్నిటికన్నా ముఖ్యంగా భాషావేత్త,
- తెలుగు సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశ పెట్టి చిరస్మరణీయమైన రచనలు చేశారు.
- కన్యాశుల్కం నాటకం ఆధునిక తెలుగు సాహిత్యంలోఅత్యంత విశిష్ట రచన.
దేశమును ప్రేమించుమన్న
మంచి అన్నది పెంచుమన్నా
ఒట్టిమాటలు కట్టిపెట్టోయ్
గట్టి మేల్ తలపెట్టవోయ్
* శివాజీ తండ్రి పేరు – శంభోజి
పదాలు – అర్థాలు :
- ఒట్టి = ఏమి లేని
- కద్దు = కలదు, ఉన్నది
- చెట్టపట్టాలు = ఒకరి చేతిని మరొకరు పట్టుకోవడం
- యశము – కీర్తి
గేయం ఆధారంగా జతపరచడం :
- తిండి కలిగితే- కండ కలదోయ్
- ఒట్టి గొప్పలు చెప్పుకోకోయ్
- చెట్టపట్టాల్ – కట్టుకొని
- ఒట్టిమాటలు – కట్టిపెట్టాయ్
- పొరుగువారికి – తోడుపడవోయ్
తెలుగు తల్లీ
- కవి : పిల్లలమర్రి వెంకట హనుమంతరావు
- కాలం : 07/05/1921 – 13/09/1989
- రచనలు : సాహిత్య సంపద, ఆంధ్రాభ్యుదయం, కాపుపాటలు
- వీరు సాహిత్య వ్యాసాలు, కథలు, ఏకాంకికలు, ఖండ కావ్యాలు రచించారు.
తేనె పలుకుల తెలుగు తల్లీ!
రవల వెలుగుల తెలుగుతల్లీ!
శాతవాహన శకము లోపల
శాంతి పాఠము నేర్పితమ్మా! – పల్లవి
కందిరీగ కిటుకు
- కవి : డా|| రావూరి భరద్వాజ
- కాలం : 05/07/1927 – 18/10/2013
- జన్మస్థలం : గుంటూరు జిల్లా తాడికొండ
- రచనలు : విమల (తొలికథ) అవరిచితులు కథాసారము వంటి 37 కథా సంపుటాలు, ఉడతమ్మ ఉపదేశం, కీలుగుర్రం వంటి పకపక 43 పిల్లల కథలు, పాకుడు రాళ్ళు,నడవడం కరిమ్రింగిన వెలగపండు, జలప్రళయం సెలయేరు వంటి 17 నవలలు.
- పురస్కారాలు : జ్ఞానపీఠ పురస్కారం, కళాప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సోవియట్ భూమినెహ్రూ పురస్కారం రాజాలక్ష్మీ ఫౌండేషన్ అవార్డు, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, కళారత్న, లోకనాయక్ ఫౌండేషన్ పురస్కారం.
- వీరి పాకుడు రాళ్ళు నవలకుగాను 2012 లో జానపీఠ పురస్కారం లభించింది
- ఏనుగుకు ఎవరు గుణపాఠం చెప్పారు – కందిరీగ
- పాత్రలు : సింహం, ఏనుగు, కందిరీగ
- పరివర్తన
- ప్రక్రియ : కథ
- ఇతివృత్తం: పిల్లల స్వభావం
- పాత్రల పేర్లు : రాము, కాకి, తేనెటీగ, చీమ
- ఈ పాఠంలో రాముకు బద్దకం ఎక్కువ. చదువంటే శ్రద్ధ తక్కువ.
- “రానున్నది వానాకాలం అసలే నాకు గూడు లేదు ఒక్కొక్క పుల్లను తెచ్చుకొని శ్రమించి గూడు కట్టుకుంటున్నాను. – కాకి
- నాకు అంత తీరిక లేదు. పూల నుంచి తేనెను సేకరిస్తున్నాను, పూలు తొందరగా వాడిపోతాయి. నాకు చాలా పని ఉంది – తేనెటీగ (తుమ్మెద)
- “ఇప్పుడు కష్టపడి గింజలు దాచుకుంటే అప్పుడు సుఖంగా ఉండొచ్చు .” అని అన్నదెవరు? – చీమ
- నేనెందుకు బడికి వెళ్ళకుండా ఇలా వ్యర్థంగా నేను బడికి వెళతాను – రాము
పదాలు – అర్థాలు :
- పరివర్తన మార్పు
- ఆత్మీయంగా ప్రేమగా
- చిన్న బుచ్చుకొను = నిరాశపడు
- రాయంచ = రాజహంస
పడవ నడపవోయి
- కవి : వింజమూరి శివరామారావు
- కాలం : 1908-1982
- జన్మస్థలం : తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం దగ్గర చంద్రపాలెం
- రచనలు : గోర్కి కథలు ; కల్పవల్లి (ఖండకావ్యసంపుటి)
- బిరుదు : కళాప్రపూర్ణ
- తరగలు = అలలు
- చక్కని రాయంచనంచు చుక్కల తళుకెంచుకొంచు – ఇందులో అంత్యాను ప్రాసాలంకారం ఉంది
- పడవ నడపవోయి పూలపడవ నడపవోయి – పల్లవి
ఉపాయం
- ఈ పాఠం మహాభారత ఇతిహాసం లోనిది.
- పాత్రలు : భీష్ముడు, ద్రోణాచార్యుడు, భీముడు, అర్జునుడు
- ఈ కథ ఉద్దేశ్యం : మన ప్రతిభాపాటవాలే మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయి తిరుగుతున్నాను. అని తెలియజేయడమే.
- బంతిని గట్టిగా ఎవరు తన్నారు? – భీముడు
- భరత వంశీయులకు విలువిద్య గురువుగా ఎవరిని ఎంచుకొన్నారు? – ద్రోణాచార్యుడుని
- ద్రోణాచార్యుడిని గురువుగా ఉండమని ఎవరు కోరారు ? – భీష్ముడు
సార్ ఒక మంచి ఆలోచన తో ప్రారంభించి మంచి పని చేసారు సార్ online లో వందలు, వేలు పెట్టిన దొరకని మెటీరియల్ మీరు ఉచితంగా అందిస్తున్నందుకు ధన్యవాదములు online exam కుడా పెడితే బాగుంటుంది సార్