Ap Tet Exam latest updates
AP TET Hall Tickets : టెట్ హాల్‌టికెట్లలో తప్పులు ఉంటే.. ఇలా చేయండి!
ఏపీ టెట్ హాల్ టికెట్లలో ఏవైనా తప్పులు దొర్లితే అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు సూచించారు. పరీక్ష కేంద్రం వద్ద వాటిని సరిచేసుకొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
AP TET DSC 10వ తరగతి తెలుగు న్యూ సిలబస్ Test 5
ఏపీలో టెట్ పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. అక్టోబర్ 3నుంచి జరగనున్న ఈ పరీక్షలకు ఇప్పటికే హాల్‌టికెట్లు విడుదల చేయగా.. కొందరికి ఒకేరోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించడం వంటి పొరపాట్లు దొర్లాయి. దీంతో టెట్ అభ్యర్థులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో అధికారులు స్పందించారు. హాల్‌టికెట్లలో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే.. అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించి పరీక్ష కేంద్రం వద్ద నామినల్ రోల్స్‌లో సరిచేయించుకోవచ్చని అభ్యర్థులకు సూచించారు. ఇందుకోసం పరీక్ష కేంద్రం దగ్గరే అధికారులు ఏర్పాట్లు చేస్తారని తెలిపారు.
AP TET Examsకు మొత్తంగా 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటివరకు 2,84,309మంది తమ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని అధికారులు వివరించారు. టెట్ పరీక్ష విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే.. అభ్యర్థులు డైరెక్టరేట్ కమిషనర్ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి. విజయరామరాజు సూచించారు. ఉదయం 10గంటల కాల్ చేసి సమాధానం తెలుసుకోవచ్చన్నారు.
ఇందుకోసం 9398810958, 6281704160, 8121947387, 8125046997, 7995789286, 9398822554, 7995649286, 9963069286, 9398822618 నంబర్లకు ఫోన్ చేయడంతో పాటు సందేహాలను ఈ-మెయిల్ ద్వారా [email protected] కు పంపవచ్చని సూచించారు. ఇలా ప్రతి రోజు టెట్ డీఎస్సీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్స్ విద్య ఉద్యోగ సమాచారం మీరు ఉచితంగా పొందాలి అనుకుంటే క్రింద ఇవ్వబడిన మన వాట్సప్ చానెల్ లింకు మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి