AP Tet Exams : SGT వారికి పేపర్ ఎలా వస్తుంది ?
ఆంధ్రప్రదేశ్ లో గత రెండు రోజులు గా స్కూల్ అసిస్టెంట్ తెలుగు, ఇంగ్లీష్ ప్రశ్నపత్రాలను పరిశీలించాను, SA తెలుగు Tet గత 2,3 టెట్ ప్రశ్నపత్రం కంటే కాస్త కఠినంగా, ట్రిక్కీ గా ఉంది పేపర్. ఎవరైతే అకాడమీ టెక్స్ట్ బుక్స్ అన్నీ క్షుణ్ణంగా చదువుతారో, వాళ్ళు ఇచ్చిన సిలబస్ ప్రకారం ప్రిపేర్ అవుతారో వాళ్ళకి మాత్రమే మంచి స్కోర్ చేసే అవకాశం ఉంది.
AP TET DSC తెలుగు 3వ తరగతి నుండి 10వ తరగతి మొత్తం Imp Bits
తెలుగు
డీఎస్సీ స్టాండర్డ్ లో ఇస్తున్నారు. పాఠ్యాంశాల్లో ప్రక్రియలు వాటి థీమ్స్, అందులోని సంభాషణలు, పాత్రల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. రచయితలు వారి శైలి, రచనలు, ఆ రచనల ప్రక్రియలు కూడా రావడం గమనార్హం. వ్యాకరణ అంశాలు కూడా బేసిక్ నుంచి మొదలకుని అత్యధిక స్థాయి వరకు ఇస్తున్నారు. వ్యాకరణ విషయంలో క్లుప్తంగా అన్నీ విషయాలు క్షుణ్ణంగా చదవండి పై పైన ముఖ్యమైనవే చదువుకుంటే ఇబ్బంది పడొచ్చు.
AP Tet Psychology Bits పెరుగుదల వికాసం పరిపక్వత Test 4
English
గ్రామర్ , లిటరేచర్ , వాకబులారీ మీద మాక్సిమం ఫోకస్ చేస్తున్నాడు. Vocabulary అయితే మెజారిటీ బిట్స్ ని డిసైడ్ చేస్తుంది.ప్రశ్నల సరళి గతం కంటే భిన్నంగా ఉన్నాయి. పేపర్ లెవెల్ కాస్త పెరిగినట్టు అనిపిస్తుంది . కొంచెం జాగ్రత్తగా ఈ కొన్ని రోజులు వినియోగించుకోండి. ఇలా ప్రతి రోజు టెట్ డీఎస్సీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్స్ విద్య ఉద్యోగ సమాచారం మీరు ఉచితంగా పొందాలి అనుకుంటే క్రింద ఇవ్వబడిన మన వాట్సప్ చానెల్ లింకు మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి