AP TET FREE COACHING CENTRES LIST

By RK Competitive Adda

Published On:

 

 

 

 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

AP TET Free Coaching 2024 :

ఏపీ టెట్ ఉచిత కోచింగ్ పై రాష్ట్ర మైనార్టీ శాఖ ప్రకటన చేసింది. రాష్ట్ర వ్యాష్ట్ర వ్యాప్తం గా 19 శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. రాష్ట్రంలోని మైనారిటీ విద్యార్థులకు టెట్ పరీక్ష కోసం ఉచిత కోచింగ్ ను అందిచనున్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ, ఏపీ ప్రభుత్వ సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ అమరావతి నుంచి ఒక ప్రకటనలో వెల్లడించారు

రాష్ట్రంలోని ముస్లిం , క్రిస్టియస్టిన్ (బీసీ-సీ), సిక్కులు, బుద్ధులు,జైనులు తదితర మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.ఏపీ- టెట్ 2024కు ఈ అవకాశాన్ని కల్పిస్తూ ఉర్దూ, తెలుగు మీడియం లో శిక్షణ ఇవ్వనున్నా మని పేర్కొ న్నారు.ఈ శిక్షణ సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ (సిఈడిఎం ) మైనార్టీ సంక్షేమ శాఖ పర్య వేక్షణలో ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 25వ తేదీ వరకు ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.

  • రాష్ట్ర వ్యాప్తంగా 19 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని జిల్లాల వారీగా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఉచిత శిక్షణ కోసం మైనారిటీ విద్యార్థులు
  • రాష్ట్రంలో ఏర్పాటుచేసిన ఆయా కేంద్రాల ద్వారా శిక్షణ పొంది సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
  • గత ఐదేళ్ల వైసిపి ప్రభుత్వ హయాంలో మైనార్టీ విద్యార్థుల సంక్షేమాన్ని, విద్యా అవకాశాలలో జగన్ నిర్లక్ష్య ర్ల ధోరణి ప్రదర్శిం చి మైనార్టీలర్టీ కు తీరని అన్యాయం చేశారని మంత్రి విమర్శిం చారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రగతి జగన్ ప్రభుత్వంలో పూర్తిగా కుంటుపడిందని పేర్కొన్నారు.
  • వైసీపీ ప్రభుత్వ ధోరణితో విసిగిన రాష్ట్ర ప్రజలు రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వా నికి తిరుగులేని మెజార్టీతోర్టీ పట్టం కట్టారని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇచ్చిన హామీలన్నిం టినీ నెరవేర్చడమే లక్ష్యం గా సీఎం చంద్రబాబు నాయకత్వం లో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలును కార్యాచరణ బద్ధం గాముందుకు తీసుకెళుతుందని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ తెలిపారు.

మైనారిటీ విద్యార్థులకు టెట్ లో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు జిల్లాల వారీగా 19 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో సిఈడిఎం ప్రధాన కార్యాలయం(విజయవాడ),ఆర్ సిఈడిఎం ఏఎం కాలేజ్ (గుంటూరు),ఉస్మానియా కాలేజ్ (కర్నూల్),ఆర్ సిఈడిఎం ఆంధ్రయూనివర్సిటీ పీజీ సెంటర్ (విశాఖపట్నం), ఆర్కే బ్రిలియంట్ ఎడ్యుకేషనల్ సొసైటీ(గుంటూరు), జోయాకోచింగ్ సెంటర్(నంద్యాల),సీఈడీఎం స్టడీస్ట సెంటర్ (కదిరి), గవర్న మెంట్యుహెచ్స్కూల్(రాయదుర్గం ), కుట్టి ఎడ్యు కేషనల్ సొసైటీ(అనంతపురం), ఎంయుహెచ్స్కూల్  (మదనపల్లె), ల్లె శ్రీ వెంకటేశ్వర కోచింగ్ సెంటర్ (తిరుపతి), శ్రీ విద్యా కోచింగ్ సెంటర్ (తిరుపతి), డజలింగ్ టాలెంట్ అకాడమీ,మున్సిపల్ ఉర్దూ హైస్కూల్ (పొద్దుటూరు), ఆజాద్ కోచింగ్ సెంటర్ (రాయచోటి),గవర్న మెంట్ హైస్కూల్ (కంభం), భావపురి విద్యా సంస్థలుస్థ (బాపట్ల), ట్లనోబుల్ కాలేజ్ (మచిలీపట్నం ), వెంకట సాయి అకాడమీ (కడప) కేంద్రాలు ఉన్నాయి.

రాష్ట్రంలోని టెట్ కు హాజరయ్యే మైనారిటీ విద్యార్థినిర్థి విద్యార్థులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఫరూక్ కోరారు

RK Competitive Adda

RK Competitive Adda అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉద్యోగాలు మరియు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వెబ్‌సైట్. మేము తాజా నోటిఫికేషన్లు, ఉద్యోగ సమాచారాలు, మరియు క్విజ్‌లను అందిస్తున్నాము.

error: Content is protected !!