Ap vaahanamitra scheme 2025 first list అక్టోబరు 1న వాహనమిత్ర పథకం డబ్బులు
ఈ నెల 17 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కొత్త దరఖాస్తుల స్వీకరణ.
Also Read
మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం …. నిబంధనలు ఇవే
- ఏపీలో రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్సు ఉండాలి.
- దరఖాస్తుదారు ఆటో రిక్షా, లైట్ మోటార్ వాహనాన్ని నడపడానికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్సు ఉండాలి.
- వాహనం ఏపీలో రిజిస్టర్ అయి ఉండాలి. మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫిట్నెస్ వంటి సర్టిఫికెట్లు ఉండాలి.
- ఆటో రిక్షా విషయంలో ఫిట్నెస్ సర్టిఫి కెట్ లేకపోయినా 2025-26 సంవత్సరానికి అనుమతిస్తారు. ఒక నెలలోపు ఆ సర్టిఫి కెట్ పొందాల్సి ఉంటుంది.
- దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్) ఉండాలి/రేషన్ కార్డు కలిగి ఉండాలి.
- దరఖాస్తుదారు లేదా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగి/ పెన్షనర్ గా ఉంటే అనర్హులు.
- పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు మినహాయింపు ఉంటుంది.
- ఇంటి విద్యుత్తు వినియోగం నెలకు 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి. దరఖాస్తు తేదీకి ముందు 12 నెలల సగటు లెక్కిస్తారు.
- వాహనాలకు ఎలాంటి పెండింగ్ బకాయిలు, చలాన్లు ఉండకూడదు. మాగాణి అయితే 3 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాల లోపు ఉండాలి.
- పట్టణ ప్రాంతాల్లో 1,000 చదరపు అడు గుల కంటే ఎక్కువ నివాస, వాణిజ్య నిర్మాణం ఉండకూడదు.
తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా 2023-24లో ఆర్థిక సహాయం పొందిన లబ్దిదారుల వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా విశ్లేషిస్తారు.
AP Free House Site Scheme 2025 : Full Details , Eligibility & Online Apply
డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి ?
ఆధార కార్డ్ , డ్రైవింగ్ లైసెన్సు , వెహికల్ RC , బ్యాంక్ పాస్ బుక్ , రేషన్ కార్డ్ , కుల ధృవీకరణ పత్రం , ఆదాయ ధృవీకరణ పత్రం
ముఖ్యమైన తేదీలు :
- అప్లై చేయడానికి చివర తేదీ : సెప్టెంబర్ 19
- ఫీల్డ్ వెరీఫికేషన్ తేదీ : సెప్టెంబర్ 22 వరకు
- అర్హుల జాబితా ప్రదర్శన : సెప్టెంబర్ 24
- అకౌంటు లో డబ్బులు జమ చేయు తేదీ : OCTOBER 1