bigg boss 8 telugu contestants final list

By RK Competitive Adda

Published On:

 

 

 

 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

బుల్లితెరపై అన్‏లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇక షూరు కానుందంటూ కొన్నిరోజులుగా వరుస ప్రోమోస్ రిలీజ్ చేస్తున్నారు నాగార్జున. అడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‏బాస్ సీజన్ 8 కొద్ది రోజుల్లో స్టార్ట్ కానుంది.

ఓవైపు ఈ షో పై వివాదాలు ఎన్ని వస్తున్నా.. ఎప్పటికప్పుడు అభిమానులు ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 1న సాయంత్రం 7 గంటలకు బిగ్‏బాస్ రియాల్టీ షో స్టార్ట్ కానుందని ఇదివరకే నిర్వాహకులు ప్రకటించారు. దీంతో సోషల్ మీడియాలో బిగ్‏బాస్ కంటెస్టెంట్స్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సీరియల్ యాక్టర్స్, హీరోహీరోయిన్స్, యాంకర్స్, సోషల్ మీడియా స్టార్స్, మోడల్స్ ఇలా చాలా మంది ఈసారి హౌస్ లోకి ఎంటరయ్యేందుకు రెడీ అయ్యారనే టాక్ నడుస్తుంది. ఇప్పటికే పలువురి పేర్లు నెట్టింట చక్కర్లు కొట్టాయి. బర్రెలక్క, కుమారీ ఆంటీ, అమృతా ప్రణయ్, రాజ్ తరుణ్ బిగ్‏బాస్ షో ఆఫర్ గురించి రియాక్ట్ అయ్యారు. తాజాగా హౌస్ లోకి అడుగుపెట్టేందుకు కంటెస్టెంట్స్ ఫైనల్ అయ్యారని.. వారంతా హౌస్ లోకి ఎంట్రీ కోసం సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు బిగ్‏బాస్ ప్రీమియర్ కు అధికారికంగా కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది.

ముందుగా బిగ్‏బాస్ సీజన్ 8లో పాల్గొనేందుకు 14 మంది కంటెస్టెంట్స్ ఫైనల్ అయ్యారని తెలుస్తోంది. అయితే ఇదివరకు నెట్టింట వినిపించిన పేర్లు కాకుండా ఇప్పుడు మరికొంత మంది కొత్త సెలబ్రెటీల పేర్లు తెరపైకి వచ్చాయి.

బిగ్‏బాస్ ఫైనల్ కంటెస్టెంట్స్..

  • విష్ణుప్రియ భీమినేని
  • శేఖర్ బాషా
  • బెజవాడ బేబక్క
  • నైనికా
  • విస్మయ శ్రీ
  • ఆదిత్య ఓం
  • మోడల్ రవితేజ
  • దర్శకుడు పరమేశ్వర్
  • ఖయ్యూమ్ అలీ
  • సౌమ్యరావు
  • గాయకుడు సాకేత్
  • అంజలి పవన్
  • అభినవ్ నవీన్
  • అభిరామ్ వర్మ

సెప్టెంబర్ 1న సాయంత్రం 7 గంటలకు స్టార్ మాలో ఈ షో ప్రారంభం కానుంది. ఈషోకు సంబంధించిన అన్ని ఎపిసోడ్‌లు Disney+ Hotstarలో అందుబాటులో ఉంటాయి. అక్కినేని నాగార్జున వరుసగా ఐదోసారి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

RK Competitive Adda

RK Competitive Adda అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉద్యోగాలు మరియు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వెబ్‌సైట్. మేము తాజా నోటిఫికేషన్లు, ఉద్యోగ సమాచారాలు, మరియు క్విజ్‌లను అందిస్తున్నాము.

🔴Related Post

error: Content is protected !!