నేటి ముఖ్యమైన వార్తలు (15.07.2024)
నేటి ప్రత్యేకత:
▪ ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం
▪ జాతీయ ప్లాస్టిక్ సర్జరీ దినోత్సవం
అంతర్జాతీయ వార్తలు :
▪ అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభివృద్ధి డోనాల్డ్ ట్రంప్ పై అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో ఓ యువకుడు కాల్పులు జరుపగా ఆయన తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు.
▪ నేపాల్ నూతన ప్రధానమంత్రిగా సిపిఎన్ – యు.ఎం.ఎల్., నేపాలి కాంగ్రెస్ (ఎన్.సి) లకుటమి తరపున సిపిఎన్ – యు.ఎం.ఎల్. పార్టీకి చెందిన కెపి శర్మ ఓలీ ఎంపికయ్యారు. ఈయన 18 నెలలపాటు నేపాల్ ప్రధానమంత్రిగా ఉంటారు.
▪ ఇటలీలోని బెరోనా ప్రావిన్స్ లో 33 మంది భారతీయ కార్మికులతో వెట్టి చాకిరీ చేస్తున్న భారత్ కు చెందిన ఇద్దరు యజమానులను పోలీసులు అరెస్టు చేశారు.
▪ ఇజ్రాయిల్ వైమానికి దాడి నుంచి తమ అగ్రనేత మహ్మద్ డైఫ్ సురక్షితంగా బయటపడ్డారని, గాజా లో కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయని హమాస్ ఆదివారం స్పష్టం చేసింది.
▪ వాతావరణం మార్పుల కారణంగా సంభవించే తీవ్ర ఉష్ణోగ్రతలు తుఫాన్లు, వరదలు, కరువు మొదలైనవి విద్యాభ్యాసానికి, విద్యా ప్రగతికి విఘాతం కలిగిస్తున్నాయని యునెస్కో విడుదల చేసిన ప్రపంచ విద్యా పర్యవేక్షణ నివేదిక (జి ఈఎం) తెలియజేసింది.
జాతీయ వార్తలు
▪ పూరి జగన్నాథ ఆలయంలోని శ్రీ క్షేత్రంలో రత్న భాండాగారం సంపదను లెక్కించడానికి తలుపులను 46 సంవత్సరాల తర్వాత నిన్న మధ్యాహ్నం మెజిస్ట్రేట్ సమక్షంలో తెరిచారు. ప్రస్తుతం ఒడిశా పూరీ రత్నభాండాగారంలో లెక్కింపు నిలిపివేత.
▪ బంగాళా ఖాతం హిందూ మహాసముద్రం వంటి సముద్ర గర్భాలలోకి శాస్త్రవేత్తలు వెళ్లి లోతైన పరిశోధనలు చేసేందుకు భారత ప్రభుత్వం సముద్రయాన్ లో భాగంగా “మత్స్య 6000” పేరుతో మానవ సహిత సబ్మెర్సిబుల్ వాహనాన్ని తయారు చేస్తోంది.
▪ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు, అమెరికాకు చెందిన ఉపగ్రహం ఐస్ సాట్-2 డేటాను వినియోగించి భారత్, శ్రీలంకల మధ్య సముద్ర గర్భంలో 29 కిలోమీటర్ల మేర రామసేతు వంతెన కు సంబంధించిన మ్యాప్ ను విడుదల చేశారు.
▪ సామాజిక మాధ్యమం ఎక్స్ లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అనుసరించే వారి సంఖ్య ఆదివారం నాడు 100 మిలియన్ లకు చేరుకుంది.
▪ 1000 మందికిపైగా అభ్యర్థులకు ఈనెల 19న మరోసారి సి.ఈ.యు.టి.-యుజి పరీక్షను నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టిఏ) నిర్ణయించింది.
▪ లోక్సభలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ గా కేరళ మావెలికెర నుంచి ఎనిమిదో సారి ఎన్నికైన సీనియర్ పార్లమెంటు సభ్యుడు కొడికున్నిల్ సురేశ్ నియమితులయ్యారు.
▪ గర్భిణీలు పిల్లల టీకాల పంపిణీ నమోదు కోసం ప్రత్యేకంగా రూపొందించిన యూ – విన్ పోర్టల్ ను ఆగస్టు చివరినాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
▪ ప్రభుత్వం పేరుతో ఈమెయిల్ రూపంలో వచ్చే నోటీసులకు సంబంధించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోం శాఖ సైబర్ క్రైమ్ విభాగం అడ్వైజరీ జారీ చేసింది.
▪ ఒక్కరోజులోనే 11 లక్షలకు పైగా మొక్కలు నాటడం ద్వారా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ గిన్నిస్ రికార్డులలోకి ఎక్కింది.
▪ దేశంలోని అక్రిడేటెడ్ పాత్రికేయులకు ప్రాతినిధ్యం వహించే ప్రెస్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్టు సి కె నాయక్ మరొకసారి ఎన్నికయ్యారు.
రాష్ట్ర వార్తలు :
▪ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిందే ముంబైలో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని ఇళ్లకు పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇంధన సామర్థ్య నిర్వహణకు దోహదపడే ఉపకరణాల వినియోగంపై ప్రజల్లో చైతన్యం తెస్తామని ముఖ్యమంత్రి తెలియజేశారు.
▪ రాష్ట్ర ప్రభుత్వానికి పర్వతనేని ఫౌండేషన్ – లుగాంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా క్రిటికల్ కేర్ అంబులెన్స్ను విరాళంగా అందించాయి.
▪ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడంతో రానున్న 24 గంటలలో కోస్తా రాయలసీమలో ఎక్కువ చోట్ల ఉరుములు ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది.
క్రీడావార్తలు :
▪ లండన్ లో జరుగుతున్న వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్ లో డిఫెండింగ్ ఛాంపియన్ స్పెయిన్ కు చెందిన ఆల్కారాస్, సెర్బియా కు చెందిన రెండవ సీడ్ నోవాక్ జకోవిచ్ ను ఓడించి టైటిల్ గెలుచుకున్నాడు.
▪ భారత జింబాబ్వే చెట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్లో భాగంగా నిన్న హరారే లో జరిగిన చివరి మ్యాచ్ లో భారత జట్టు 42 పరుగుల తేడాతో విజయం సాధించి 4-1 తో సిరీస్ ను గెలుచుకుంది.