ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన :
- తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి తాజా ఓటర్ల జాబితా రూపకల్పనకు ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది.
- ఈసీ ఆదేశాలమేరకు 2024 నవంబరు 1 నాటికి జాబితా రూపోందించేలా షెడ్యూలు విడుదల చేయాలని నిర్ణయించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ తెలిపారు.
- ఈ నెల 29న ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి ఓటర్ల రిజిస్ట్రేషన్కు ఈసీ.. నోటీసు విడుదల చేయనుంది.
- శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ ఉపాధ్యాయ నియోజకవర్గానికి, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్ల జాబితాలో పేర్ల నమోదుకు 2024 సెప్టెంబరు 30న ఎన్నికల సంఘం నోటీసు జారీ చేయనుంది.
- 2024 డిసెంబరు 30 నాటికి తుది ఓటర్ల జాబితా రూపొందిస్తామని సీఈవో కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఎమ్మెల్సీలు ఇళ్ల వెంకటేశ్వరరావు, కేఎస్ లక్ష్మణ రావు, పాకలపాటి రఘువర్మ పదవీకాలం 2025 మార్చి 29తో పూర్తి అవుతుందని ఈసీ ప్రకటనలో వెల్లడించింది.