GOOD NEWS FOR AP PEOPLE PRICES DECREASED HUGELY

By RK Competitive Adda

Published On:

 

 

 

 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

ప్రస్తుతం ధరలు మండిపోతున్నాయి. నిత్యవసర వస్తువుల ధరలతో సామాన్యులు సైతం ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఉపశమనం కలిగించే ప్రకటన చేసింది. నిత్యవసర వస్తువుల అయిన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ కీలక ప్రకటన చేశారు. అయితే మార్కెట్లో కిలో కింది పప్పు ధర రూ.160గా ఉండగా, 10 రూపాయలు తగ్గించింది. దీంతో ప్రస్తుతం కిలో పప్పు ధర రూ.150కి చేరింది. అలాగే కిలో బియ్యం ధర రూ.48 ఉండగా, ఇప్పుడు రూ.47కు చేరింది.

ఇప్పుడు తగ్గించిన ధరలతో రైతు బజార్‌లో కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. ఈ తగ్గించిన ధరలతో గురువారం నుంచి విక్రయిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని జాయింట్‌ కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. కాగా, రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన ఈ నెల రోజుల వ్యవధిలో బియ్యం, కంది పప్పు ధరలను రెండుసార్లు తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని ఆయన గుర్తు చేశారు

RK Competitive Adda

RK Competitive Adda అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉద్యోగాలు మరియు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వెబ్‌సైట్. మేము తాజా నోటిఫికేషన్లు, ఉద్యోగ సమాచారాలు, మరియు క్విజ్‌లను అందిస్తున్నాము.

error: Content is protected !!