NMMS SCHOLARSHIP విద్యార్దులకు శుభవార్త ప్రతి ఒక్కరికీ 12 వేలు

By RK Competitive Adda

Updated On:

 

 

 

 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

నేషనల్ మిన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (NMMS) పరీక్షకు 8వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి బి.వరలక్ష్మీ తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

అర్హతలు

  • ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠ శాలలు, వసతి సౌకర్యం లేని ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతూ ఉన్నవారు అర్హులు
  • కుటుంబ సంవత్సర ఆదాయం రూ. 3.5 లక్షలలోపు ఉన్న విద్యార్థులు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు.
    ఈ ఏడాది డిసెంబరు 8న పరీక్ష ఉంటుందన్నారు.
  • ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 50 చెల్లించాల్సి ఉంటుందన్నారు.

ఆన్లైన్లో సెప్టెంబరు 6లోగా దరఖాస్తు చేసుకోవాలని, పరీక్ష ఫీజు సెప్టెంబరు 10లోగా ఎస్బీఐ కలెక్ట్ లింకు ద్వారా చెల్లించాల్సి ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు www.bse.ap.gov.in వెబ్సై ట్లో సంప్రదించాలని సూచించారు. అనంత పురం కమలానగర్ లోని పాత డీఈఓ కార్యా లయంలో ఉన్న పరీక్షల విభాగంలోనూ సంప్రదించవచ్చన్నారు.

NMMS అంటే ఏంటి ? ఎలా అప్లై  చేసుకోవాలి ?

ఎనిమిదో తరగతి చదువుతూనే సంవత్సరానికి 12,000 స్కాలర్షిప్ పొందడానికి అవకాశాన్ని మనకు కేంద్ర ప్రభుత్వం ఎన్.ఎం.ఎం.ఎస్ అనే స్కీం ద్వారా అందిస్తుంది. దీనికి ఎవరు అర్హత, ఎలా అప్లై చేయాలి.. అప్లై చేయడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి ఆర్థికంగా వెనకబడిన మెరిట్ విద్యార్థులకు సహాయం చేయాలని ఉద్దేశంతో 2008లో సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ అనే ఒక స్కీంని ప్రారంభించడం జరిగింది.

ఈ స్కీమ్ ద్వారా దేశ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్ష మంది మెరిట్ విద్యార్థులను సెలెక్ట్ చేసి ప్రతి సంవత్సరము 12000 అంటే ఇంటర్మీడియట్ పూర్తి అయ్యే వరకు స్కాలర్షిప్ రూపంలో అందజేస్తారు.మన ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి సంవత్సరము 4000 మంది అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులను సెలెక్ట్ చేయడం అవుతుంది. అలాగే తెలంగాణ నుంచి 3,000 మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు.అసలు ఎం ఎం ఎస్ పరీక్ష రాయడానికి ఎవరు విద్యార్థులు అర్హులు చూద్దాం. ప్రస్తుత సంవత్సరం 8th క్లాస్ చదువుతున్న అకాడమిక్ విద్యార్థులే ఈ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ రాయడానికి అర్హులు. అయితే వారు ముందు సంవత్సరం ఏడవ తరగతిలో బీసీ,ఓసీ విద్యార్థులైతే 55% మార్కులు తెచ్చుకుని ఉండాలి అలాగే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 50% మార్కులు తెచ్చుకుని ఉంటే సరిపోతుంది.

ఇలా ప్రతి రోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమాచారం మీరు రోజు ఉచితంగా పొందాలి అనుకుంటే ఇప్పుడే క్రింద ఉన్న లింకు మీద క్లిక్ చేసి మన వాట్సప్ చానెల్ లో జాయిన్ అవ్వగలరు

https://whatsapp.com/channel/0029Vafc2q2Fsn0XGjg5pr12

RK Competitive Adda

RK Competitive Adda అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉద్యోగాలు మరియు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వెబ్‌సైట్. మేము తాజా నోటిఫికేషన్లు, ఉద్యోగ సమాచారాలు, మరియు క్విజ్‌లను అందిస్తున్నాము.

error: Content is protected !!