ఉచితంగా గ్యాస్ సిలిండర్ కి ఇలా అప్లై చేయండి

TDP Janasena promises 3 free LPG cylinders in AP

కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) ప్రభుత్వం ఉజ్వల్ పథకాన్ని తిరిగి ప్రారంభించింది. దీనికింద ఒక గ్యాస్ స్టవ్ తోపాటు ఒక గ్యాస్ సిలిండర్ ను కూడా ఉచితంగా ఇస్తారు.

రీఫిల్లింగ్ చేసుకునేందుకు ఏడాదికి 12 సిలిండర్లపై రాయితీ లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఈ పథకం కింద 10.50 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందాయి. ఈ పథకం రెండో ఫేజ్ ను కేంద్రం తాజాగా ప్రారంభించింది. ఇప్పటికే 2.34 కోట్లమంది ఈ కనెక్షన్లు తీసుకున్నారు. దరఖాస్తు ఎలా చేయాలో తెలుసుకుందాం.

ఎంబీసీ మహిళలకు కూడా

దరఖాస్తు చేసుకునేవారు ఎస్సీ, ఎస్టీ, ఎంబీసీ వర్గాలకు మహిళ అయి ఉండాలి. 18 సంవత్సరాల వయసు నిండటంతోపాటు మరో ఎల్పీజీ కనెక్షన్ కూడా ఉండకూడదు. అలాగే అడవుల్లో జీవించేవారు, దీవుల్లో నివసించేవారు, నదీ దీవుల్లో జీవించేవారు, దారిద్ర్య రేఖకు దిగువన ఉండేవారు, టీగార్డెన్ గిరిజనులు, మాజీ టీగార్డెన్ గిరిజనులకు కూడా ఇస్తారు. ఆధార్ కార్డు, వ్యక్తిగత గుర్తింపుకార్డు, అడ్రెస్ ప్రూఫ్, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నెంబరు తీసుకొని దగ్గరలోనే ఏ ఎల్పీజీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ నైనా సంప్రదించొచ్చు.

ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాలంటే

ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలంటే https://www.pmuy.gov.in/ujjwala2.html వెబ్ సైట్ లోకి వెళ్లి డిస్ట్రిబ్యూటర్ ను ఎంచుకోవాలి. రిజిస్టర్ నౌ అని వచ్చిన తర్వాత ఫోన్ నెంబరు, మెయిల్, క్యాప్చా ఇచ్చిన తర్వాత స్క్రీన్ పై వచ్చే అప్లికేషన్ ఫారాన్ని డౌన్ లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి. దాన్ని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ కు ఇవ్వాలి. వివరాలన్నీ కచ్చితంగా ఉండాలి. డిస్ట్రిబ్యూటర్ కు ఇచ్చిన తర్వాత అతన్నుంచి ఎక్నాలడ్జ్ మెంట్ కార్డు తీసుకోవాలి. వివరాలన్నీ పరిశీలించిన తర్వాత మీ అర్హతలను బట్టి ఉజ్వల పథకం కింద ఎంపిక చేసినట్లు తెలుపుతారు.

error: Content is protected !!