HOW TO PAY ELECTRICITY BILL NEW PROCESS IN TELUGU

By RK Competitive Adda

Published On:

 

 

 

 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో EPDCL పరిధిలో అనగా ఉమ్మడి గోదావరి ,విశాఖ ,విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాల్లో ఉన్నటువంటి కస్టమర్లు ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్ ద్వారా పవర్ బిల్లును చేసేవారు ప్రస్తుతం RBI వారి ఆదేశాల మేరకు థర్డ్  పార్టీ యాప్ ద్వారా అంటే ఫోన్ పే, గూగుల్ పే ద్వారా పవర్ బిల్ పేమెంట్ ఇక మీదట జరగదు దానికి బదులు గా EPDCL అధికారిక వెబ్సైట్లో గాని లేదా మొబైల్ యాప్ లో గాని పేమెంట్ చేస్తే అవుతుంది .

అధికారిక వెబ్సైట్లో పేమెం ట్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం

కింద ఇవ్వబడిన అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి .

CLICK HERE Official Web Site

పైన లింకు క్లిక్ చేశాక ఆ పేజీ లో  Click Here to Pay అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి .

తరువాత సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కిందనే ఇచ్చినటు వంటి కూడికను నెంబర్ వేసి SUBMIT పై క్లిక్ చేయండి చేసిన తర్వాత మీ యొక్క

  • సర్వీస్ నెంబరు
  • కస్టమర్ పేరు
  • గ్రామము
  • బిల్ తేదీ
  • పేమెం ట్ చేయడానికి చివరి తేదీ
  • కనెక్షన్ తీసివేయు తేదీ అనే వివరాలు చూపిస్తుంది .

Is Your Service Disconnected ? అంటే కరెంటు కనెక్షన్ తీసి వేసినట్టయితే Yes అని తీయకపోతే No అని సెలెక్ట్ చేసు కొని Click Here to Pay అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి

ఇలా ఈ *  మార్క్ పై క్లిక్క్లి చేయండి .

తర్వాత  Bill Desk ను సెలెక్ట్ చేసుకోండి.

పేమెంట్ చేయాలా అని అడుగుతుంది OK పై క్లిక్ చేయండి.

మీ వద్ద క్రెడిట్ కార్డు ఉన్న ,డెబిట్ కార్డు ఉన్న , ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉన్న , ఎటువంటి యాప్స్

అంటే గూగుల్ పే , ఫోన్ పే వంటి యాప్స్ ఉన్న పేమెంట్ చేయవచ్చు

ప్రస్తుతానికి QR కోడ్ ద్వారా పేమెంట్ చేయుటకు గాను పైన చూపిన విధముగా QR పై క్లిక్క్ చేయండి .

తరువాత రెండు ఆప్షన్లు చూపిస్తాయి రెండిటిలో ఏదో ఒక దానిపై అంటే BHIM గాని Bharat QR గాని సెలెక్ట్ చేసుకుని Make Payment పై క్లిక్ చేయండి క్యూ ఆర్ కోడ్ చూపిస్తుంది దానిని మీ ఫోన్ లో ఉన్నటువంటి యాప్ల ద్వారా స్కాన్ చేయండి లేదా యూపీఐ ఐడి ఎంటర్ చేసి మేక్ పేమెంట్ చేసినట్టయితే మీ మొబైల్ యాప్ కు పేమెంట్ వస్తుంది అక్క డ పేమెంట్ చేసేయండి  పేమెంట్ పూర్తయిన తర్వాత పైన చూపిన విధముగా మీకు రసీదు చూపిస్తుంది దానికిగాను ప్రింట్ పై టిక్ చేసి పిడిఎఫ్ గా సేవ్ చేసుకోవచ్చు లేదా స్క్రీ న్ షాట్ అయినా తీసుకోవచ్చు . ఇలా మీ బిల్లును ప్రతినెల పేమెంట్ చేసుకోవచ్చు

 

RK Competitive Adda

RK Competitive Adda అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉద్యోగాలు మరియు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వెబ్‌సైట్. మేము తాజా నోటిఫికేషన్లు, ఉద్యోగ సమాచారాలు, మరియు క్విజ్‌లను అందిస్తున్నాము.

🔴Related Post

error: Content is protected !!