Lpg Gas Cylinder Price Latest News Today

By RK Competitive Adda

Published On:

 

 

 

 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

దేశంలోని మోడీ సర్కార్‌ ప్రజల కోసం ఎన్నో పథకాలను తీసుకువస్తోంది. ముఖ్యంగా గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారుల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఎన్నికలకు ముందు గ్యాస్‌ సిలిండర్ ధరలను భారీగానే తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు నెల ప్రారంభమైంది. ఈ నెలలో మరోసారి కోట్లాది మందికి సాధారణ వినియోగదారుల కంటే తక్కువ ధరకే ఎల్‌పీజీ సిలిండర్లు అందనున్నాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే, కస్టమర్‌లు వచ్చే ఎనిమిది నెలల వరకు ఈ సదుపాయం పొందుతూనే ఉంటారని తెలుస్తోంది. ఏ కస్టమర్లు దీని ప్రయోజనాన్ని పొందగలరో తెలుసుకుందాం

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం 300 రూపాయల సబ్సిడీని ఇస్తుంది. దీని కింద సాధారణ వినియోగదారుల కంటే లబ్ధిదారులకు 300 రూపాయల తక్కువ సిలిండర్ లభిస్తుంది. ఉదాహరణకు దేశ రాజధాని ఢిల్లీలో సాధారణ కస్టమర్లు రూ.803కే ఎల్‌పీజీ సిలిండర్‌ను పొందుతున్నారు. అదే సమయంలో ఉజ్వల లబ్ధిదారులు రూ.300 తగ్గింపుతో రూ.503కే సిలిండర్‌ను పొందుతున్నారు. అయితే ఎన్నికలకు ముందు ప్రధాన్‌ మంత్రి ఉజ్వల యోజన కింద పొందిన సిలిండర్లపై రూ.300 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. అయితే ఇప్పుడు మరోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పుడు ప్రకటించిన సబ్సిడీ పథకం మరో ఎనిమిది నెలల పాటు కొనసాగే అవకాశం ఉందని కేంద్ర వర్గాల ద్వారా సమాచారం. కేంద్ర కేబినెట్‌లో కూడా ఈ పథకం కొనసాగింపుపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం

RK Competitive Adda

RK Competitive Adda అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉద్యోగాలు మరియు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వెబ్‌సైట్. మేము తాజా నోటిఫికేషన్లు, ఉద్యోగ సమాచారాలు, మరియు క్విజ్‌లను అందిస్తున్నాము.

error: Content is protected !!