WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Ap Schemes, నిరుద్యోగ భృతి

Nirudyogi Bruthi Apply Online 2025

Follow us:

Nirudyogi Bruthi Apply Online 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు యువగళం పాదయాత్రలో నిరుద్యోగ యువతను ఆదుకునేందుకు టిడిపి అధినేత ప్రస్తుత ఏపీ సిఎం చంద్రబాబునాయుడు గారు రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తాం అని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. దీనిని అమలుచేసి తీరుతామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు.

Annadatha sukhibava payment status 2025

నిరుద్యోగ భృతి ఎవరికివ్వాలి, అర్హతలేంటి, ఎంత ఇవ్వాలనే దానిపై విధివిధానాలు పై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. చంద్రబాబు గారి ఆదేశాలతో దీనిపై అధ్యయనం చేసిన కమిటీ త్వరలోనే  నివేదికను సమర్పించనుంది. ఈ నివేదిక ఆధారంగా ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ భృతిని ఇవ్వనున్నసంగతి తెలిసిందే. అయితే, ఎవరెవరికి ఈ భృతిని ఇస్తారు? ఎంత మందికి ఇస్తారనే వివరాలు ఇక్కడ చూడండి

నిరుద్యోగ భృతి అర్హతలు – ఎవరు అర్హులు :

  • 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు
  • హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో తప్పనిసరి
  • నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ పొందాలి
  • గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమా లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి.
  • ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగం చేస్తూ ఉండకూడదు.
  • ఏపీలో జన్మించినవారే అర్హులు.

ఈ ఏడాదే 2025 లో నిరుద్యోగ భృతి ఇవ్వబోతున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు.

నిరుద్యోగ భృతిని ఈ ఆర్థిక సంవత్సరంలో అమలు చేస్తామని మచిలీపట్నం లో జరిగిన కార్యకర్తల సమావేశంలో లోకేష్ గారు ప్రస్తావించారు. ఈ సంవత్సరంలోనే నిరుద్యోగ భృతి పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు.

కావలసిన సర్టిఫికెట్స్ :

  • కుల ధ్రువీకరణ పత్రం
  • రేషన్ కార్డు
  • ఆధార్ కార్డు
  • గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ లేదా బీటెక్ సర్టిఫికెట్
  • బ్యాంకు పాస్ బుక్ (NPCI లింకింగ్ తప్పనిసరి)

నిరుద్యోగ భృతి ఎంత ఇస్తారు ?

AP రాష్ట్రంలో అర్హత ఉన్న నిరుద్యోగుల అకౌంట్లో ప్రతీ నెలా 3,000/- రూపాయలు జమ చేస్తారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలు పైన ప్రస్తుతం కసరత్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

నిరుద్యోగ భృతి ఎప్పటినుండి అమలు చేస్తారు ?

మంత్రి నారా లోకేష్ గారు తాజాగా చేసిన ప్రకటన ప్రకారం ఈ సంవత్సరం చివరిలోపు నిరుద్యోగ భృతి పథకాన్ని అమలు చేస్తామని కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన వెల్లడించారు.

నిరుద్యోగ భృతి పథకం గతంలో కూడా అమలు :

2019 సంవత్సరంలో ఎన్నికలకు ముందు నిరుద్యోగ భృతి పథకాన్ని అమలు చేసింది. ఈ పథకం అమలు చేసిన తర్వాత ప్రారంభంలో అర్హులైన నిరుద్యోగుల అకౌంట్ లో నెలకు 1,000/- రూపాయలు చొప్పున జమ చేసింది. తరువాత నెలకు 2,000/- రూపాయలు చొప్పున జమ చేసింది. 2019 లో ప్రభుత్వం మారడంతో ఈ పథకం ఆగిపోయింది. 2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని ఈ సంవత్సరం చివరిలోపు అమలు చేసేందుకు కసరత్తు చేస్తుంది.

ఇలాంటి ప్రభుత్వ పథకాల సమాచారం మీ మొబైల్ కు రావాలి అంటే వెంటనే మా వాట్సప్ చానెల్ లో జాయిన్ అవ్వండి.

Raj Kumar

Related Posts

error: Content is protected !!