ఏపీలో మరో సంచలన నిర్ణయం
రేషన్ బియ్యం తీసుకోపోతే రైస్ కార్డు కట్
రేషన్ బియ్యం దందాకు ప్రధాన కారణం ఆ బియ్యంను ప్రజలు తినకుండా బ్లాక్ లో అమ్ముకోవడమే అంటున్న అధికారులు.
ఎవరైనా డిపో వాళ్ళు గాని, వాహనాల్లో కొనట్లు తెలిస్తే వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.అదేవిధంగా అమ్మిన వారి వద్ద నుంచి రేషన్ కార్డు స్వాధీనం చేసుకుంటామని అన్నారు.
అలాగే ఏపీలో రేషన్ కార్డుదారులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెల్ల రేషన్ కార్డులున్న వారికి ఇకపై బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు కూడా ఇవ్వనున్నారు.
రేషన్ కార్డుదారులకు వచ్చే నెల నుంచి ఉచిత బియ్యంతో పాటు సబ్సిడీ పై చక్కెర, కందిపప్పును పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కిలో కంది పప్పును రూ.67కే ఇవ్వనుంది. అలాగే అర కిలో చొప్పున చక్కెరను పంపిణీ చేయనుంది. చక్కెర, పప్పు సరఫరా కోసం కాంట్రాక్టర్ల నుంచి టెండర్లు ఆహ్వానించింది.
ఈ వారంలోనే ఈ-పాక్యూర్‌మెంట్ ద్వారా టెండర్ల ప్రక్రియను పూర్తి చేయనుంది. ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కేబినేట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.