RRB NTPC 2024 Notification ఇంటర్ అర్హతతో 12 వేల ఉద్యోగాలు అప్లై చేయండి

By RK Competitive Adda

Updated On:

 

 

 

 

RRB Ntpc 2024 Notification

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

RRB NTPC 2024 Notification

రైల్వే నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది  రిక్రూట్‌మెంట్ కోసం అధికారికంగా నోటిఫికేషన్‌ను ప్రకటించింది.

భారతీయ రైల్వేలలో వివిధ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల(NTPC) పోస్టుల కోసం మొత్తం 11558 ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.ఈ నోటిఫికేషన్ సెప్టెంబర్ 2న విడుదల చేశారు. గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్-స్థాయి పోస్టుల కోసం అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు ప్రక్రియ, ఇతర సంబంధిత సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోండి.

మెుత్తం ఖాళీలు : 11558

SSC GD Constable Jobs 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

విద్యార్హతలు 

గ్రాడ్యుయేట్ (లెవెల్ 5, 6)  పోస్టులకు డిగ్రీ కంప్లీట్ చేయాలి.

అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు 12వ తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలి. ( లెవెల్ 2, 3) పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలి.

పోస్టుల వివరాలు »

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11,558 ఖాళీలను భర్తీ చేయనున్నారు. గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 14న ప్రారంభమవుతుంది. 13 అక్టోబర్ 2024 వరకు కొనసాగుతుంది. అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ 21 సెప్టెంబర్ నుండి 20 అక్టోబర్ 2024 వరకు ఉంటుంది.

గ్రాడ్యుయేట్ పోస్టుల్లో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉండే అవకాశం ఉంది.

అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీలో చూసుకుంటే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్ క్లర్క్, ట్రైన్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు ఉద్యోగాలు ఉండే ఛాన్స్ ఉంది.

పరీక్ష విధానం ♦

  • ఆన్‌లైన్ పరీక్ష స్టెప్ 1 -CBT 1
  • ఆన్‌లైన్ పరీక్ష స్టెప్ 2 – CBT 2
  • టైపింగ్ టెస్ట్ (స్కిల్ టెస్ట్) / ఆప్టిట్యూడ్ టెస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • వైద్య పరీక్ష

ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలి ?

RRB అధికారిక వెబ్‌సైట్‌ rrbapply.gov.in ను సందర్శించి RRB NTPC 2024 నోటిఫికేషన్‌ను డౌన్లోడ్ చేసి
దానిని జాగ్రత్తగా చదవండి.

  1. ప్రాథమిక వివరాలను అందించడం ద్వారా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.
  2. కచ్చితమైన సమాచారంతో దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
  3. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.
  4. దరఖాస్తు రుసుము చెల్లించండి.
  5. పూర్తి చేసిన దరఖాస్తును గడువులోపు సమర్పించండి

Download Notification

 

 

RK Competitive Adda

RK Competitive Adda అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉద్యోగాలు మరియు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వెబ్‌సైట్. మేము తాజా నోటిఫికేషన్లు, ఉద్యోగ సమాచారాలు, మరియు క్విజ్‌లను అందిస్తున్నాము.

1 thought on “RRB NTPC 2024 Notification ఇంటర్ అర్హతతో 12 వేల ఉద్యోగాలు అప్లై చేయండి”

Comments are closed.

error: Content is protected !!