THALLIKI VANDANAM SCHEME 2024 OFFICIAL UPDATES

By RK Competitive Adda

Updated On:

 

 

 

 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

YSRCP ప్రభుత్వం అమలు చేసిన అమ్మ ఒడి స్థానంలో కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన తల్లికి వందనం పథకంపై పొలిటికల్‌ వివాదం రాజుకుంది. తల్లికి వందనం పథకం విధివిధానాలు ఇవే అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది వైసీపీ. జీవోలో ప్రతి విద్యార్థికి అని కాకుండా ప్రతి తల్లికి అని రాశారంటూ వైసీపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టీ మరీ భగ్గుమన్నారు. హామీలపై కూటమి నేతలు ఎన్నికలకు ముందు ఒకలాఎన్నికల తర్వాత మరోలా మాట్లాతున్నారంటూ మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ఆర్థికసాయం చేస్తామన్న కూటమి ప్రభుత్వం ఒక్క బిడ్డకే ఆర్థికసాయం ఇచ్చేలా జీవో విడుదల చేసిందన్నారు. తల్లికి వందనం పేరిట పిల్లలకు పంగనామాలు పెట్టారంటూ ఎద్దేవా చేశారు.

సూపర్ సిక్స్ లో భాగమైన ‘తల్లికి వందనం’ పథకంపై వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఖండించి పథకం పై ఇంకా మార్గదర్శకాలు ఖరారు చేయలేదని స్పష్టం చేసింది. సోషల్‌ మీడియాతో పాటు కొన్ని పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారం నమ్మవద్దని ప్రకటించింది. ప్రభుత్వం విధివిధానాలు రూపొందించిన తర్వాత అధికారికంగా విడుదల చేస్తామని చెప్పింది. అప్పటివరకూ ఎలాంటి అవాస్తవాలు నమ్మవద్దనీ సూచించింది.

ఎన్నికల క్యాంపెయిన్ సమయంలో.. తల్లికి వందనం పేరుతో కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉన్నా కూడా… ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకూ చదివే విద్యార్థులకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేలు చొప్పున నగదు అందిస్తామని కూటమి పార్టీలు హామి ఇచ్చాయి. ఇక ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించి.. అధికారం చేపట్టింది. ఈ నేపథ్యంలో తల్లికి వందనం పథకం అమలుకు మార్గదర్శకాలు ఇవేనంటూ.. కొన్ని మార్గనిర్దేశకాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అవన్నీ ఫేక్ అని.. మార్గదర్శకాలని త్వరలోనే విడుదల చేస్తామని కూటమి సర్కార్ ప్రకటించింది.

RK Competitive Adda

RK Competitive Adda అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉద్యోగాలు మరియు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వెబ్‌సైట్. మేము తాజా నోటిఫికేషన్లు, ఉద్యోగ సమాచారాలు, మరియు క్విజ్‌లను అందిస్తున్నాము.

error: Content is protected !!