ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో మహిళలకు తల్లికి వందనం అనే సంక్షేమ పథకం తమ కూటమి ప్రభుత్వం అధికారం లోకి రాగానే ఏడాదికి 15,000 రూ చొప్పున ఇస్తామని మేనిఫెస్టో లో హామీ ఇచ్చారు
తల్లికి వందనం అనే సంక్షేమ పథకం 2024 లోనే ప్రారంభించనున్నారు అయితే ఈ పథకానికి ఎవరు అర్హులు ? ఎవరికి 15,000 రూ ఇస్తారు ? ఏఏ డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి ? అనేది ఇప్పుడు చూద్దాం
ఈ తల్లికి వందనం పథకానికి సంబందించి ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది అందులో ఏముంది అనేది కూడా ఇక్కడ మీకు పూర్తి వివరాలు చూడవచ్చు
తల్లికి వందనం మరియు స్టూడెంట్ కిట్ పధకాలకు “Aadhar Act 18 of 2016” ను వర్తింప చేస్తూ G.O 29 dt 9.7.2024 ను విడుదల చేసినది. ఈ G.O విధి విధానాలకు సంబంధించినది కాదు ఈ స్కీములో తల్లి/తండ్రి/ విద్యార్థులకు ఆధార్ కార్డు నెం లేక ఎన్రోల్మెంట్ నెం తప్పని సరిచేయుట జరిగినది.ఆధార్ లేని వారు ఆధార్ క్రొత్తగా తీసుకోవాలి.
ఈ G.O 29 ప్రకారములో 1 నుండి 12 వరకు చదువుతూ 75 % హాజరు ఉన్న BPL విద్యార్థులకు తల్లికి వందనం క్రింద సంవత్సరానికి Rs 15000 లు ఇవ్వ బడునని స్ధూలంగా చెప్పబడినదే కాని ఒక్క విద్యార్థికే ఇస్తామని కాని అందరు తల్లి కి ఉన్న అందరు విద్యార్థులకు ఇస్తామని కాని విధి విధానాలు పేర్కొన లేదు
విద్యార్థి ఫలానా మేనేజ్మెంట్ స్కూలులో చదివితేనే “తల్లికి వందనం” వర్తించునని ఎక్కడా ప్రస్తావించలేదు. స్టూడెంట్ కిట్ మాత్రము Govt School లో చదివే వారికే వర్తించునని మనకు తెలుసు
Below poverty line (BPL) కుటుంబాలంటే ఎవరు ?
- కుటుంబ సభ్యుల ఆదాయం అంటే తల్లి తండ్రి ల ఎవరిదైనా లేక ఇద్దరి దైనా ఈ క్రింది విధంగా ఉంటే వారిని BPL Families అంటారు
- రూరల్ లో నెలకు 10000, అర్బన్ లో నెలకు రు 12000 కంటే తక్కువ కుటుంబ ఆదాయం
- మాగాణి అయితే 3 ఎకరాలు మెట్ట అయితే 10 ఎకరాలు రెండూ కలిపి అయితే 10 ఎకరాల కంటే తక్కువ పంట భూమి ఉన్న కుటుంబాలు
- నెలకు 300 యూనిట్స్ కంటే తక్కువ కరంటు వాడే వారు
- ప్రభుత్వ ఉద్యోగము/ ప్రభుత్వ పెన్షనరు లేని కుటుంబము ( ప్రభుత్వ తీసుకొంటున్న శానిటరీ వర్కర్స్ కుమినహాయింపు)
- టాక్సీ, ట్రాక్టరు, ఆటో వంటి మినహా 4 చక్రాల వాహనాలు కల కుటుంబాలు అర్హులు కారు
- Income tax చెల్లించే వారు అర్హులు కారు
- పట్టణాలలో 1000 sq feet కంటే ఎక్కువ మున్సిపల్ స్ధలము ఉన్న కుటుంబాలు కూడా అర్హులు కారు
తల్లికి వందనం వర్తింపు & చెల్లింపు లపై విధివిధానాలు త్వరలో వెలవడును.
అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి సంక్షేమ పథకాలకు సంబందించిన సమాచారం మీరు వేగంగా తెలుసుకోవాలని అనుకుంటే ఇప్పుడే క్రింద ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి