Train Journey చేసే వారికి అదిరిపోయే శుభవార్త ఒక్కసారి టికెట్ తీసుకుంటే 56 రోజులు ప్రయాణం

భారతదేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థగా నిలిచింది. నిత్యం లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. భారీ సంఖ్యలో ఉద్యోగులు, సర్వీసులు అందించే రంగం భారతీయ రైల్వే రంగం.

 

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం ఇండియన్ రైల్వే.. నిత్యం ఎప్పటికప్పుడు రకరకాల స్కీమ్ లు, నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. అలానే ప్రయాణికుల కోసం ఎన్నో రకాల సౌకర్యాలను అందిస్తుంటుంది. అయితే వీటిల్లో చాలా వాటి గురించి ప్రయాణికులకు పెద్దగా తెలియదు. అలానే రైల్వే టికెట్లు కూడా రకరకాలుంటాయి. అలాంటి ఒక టికెట్ గురించి మీకు చెప్పబోతున్నాం. ఇది తీసుకుంటే.. 56 రోజుల పాటు ప్రయాణం చేయవచ్చు. ఆ వివరాలు..

రైలులో ప్రయాణం చేయాలనుకుంటే.. మాటిమాటికి టికెట్ కొనే పని లేకుండా.. దానికోసం ప్రత్యేక టికెట్ సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చింది ఇండియన్ రైల్వే. ఇది తీసుకుంటే.. ఒకే టికెట్ తో 56 రోజల వరకు.. దేశం మొత్తం రైలు ప్రయాణం చేయవచ్చు. అదే సర్క్యులర్ టికెట్. ట్రైన్ సర్క్యులర్ ట్రావెల్ టికెట్ అనేది భారతీయ రైల్వే ద్వారా అందించబడే ఒక ప్రత్యేక టికెట్. ఇది తీసుకుంటే ప్రయాణికులు ఒకే టికెట్ తో 56 రోజుల వరకు ప్రయాణించవచ్చు.

సర్క్యులర్ ట్రావెల్ టికెట్ తీసుకున్న ప్రయాణికుటు ఒకే టికెట్ తో 8 వేర్వేరు రైలు స్టేషన్లకు ప్రయాణించవచ్చు. అయితే, ఈ టికెట్లను టికెట్ కౌంటర్లలో నేరుగా కొనుగోలు చేయలేరు. అలానే రైల్వే వెబ్‌సైట్, టికెట్ కౌంటర్ ద్వారా కూడా ఈ సర్క్యులర్ టికెట్లను బుక్ చేసుకోలేరు. సర్క్యులర్ ట్రావెల్ టికెట్ పొందడానికి ముందుగా జోనల్ రైల్వేకి దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది.

మీరు ఎక్కువ రోజులు రైలు ప్రయాణం చేయాలనుకున్న లేదా పర్యాటక ప్రాంతాలను సందర్శించాలనుకుంటే.. అనేక స్టాప్‌ల నుండి టికెట్లు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకు బదులుగా ఈ సర్క్యులర్ టికెట్ తీసుకుంటే సరిపోతుంది. దీని వల్ల మీ ప్రయాణం మరింత సులభం అవుతుంది. ఈ టిక్కెట్ కోసం మీరు ముందుగా రైల్వే శాఖకి మీ ప్రయాణ వివరాలు తెలియజేయాల్సి వుంటుంది. అంటే మీరు సర్క్యులర్ టికెట్ కొనుగోలు చేసినప్పుడు, మీ ప్రయాణం ఎక్కడ ప్రారంభమవుతుంది, ఎక్కడ ముగుస్తుంది వంటి వివరాలు జోనల్ రైల్వేకు అందించాలి.

మీ షెడ్యూల్ ప్రకారం సర్క్యులర్ ట్రావెల్ టికెట్లను కొనుగోలు చేయవచ్చు. దీని వల్ల మాటిమాటికి టికెట్ కొనే అవసరం ఉండదు.. అలానే మీ సమయం, డబ్బు ఆదా అవుతుంది. సాధారణ పాయింట్ టూ పాయింట్ ఛార్జీల కంటే తక్కువ ధరకే మీకు ఈ సర్క్యులర్ టికెట్లు లభిస్తాయి. ఈ సర్క్యులర్ టికెట్‌ని ఉపయోగించి ఎనిమిది స్టేషన్లకు ప్రయాణించవచ్చు. దీని వ్యాలిడిటీ 56 రోజులు ఉంటుంది. దాదాపు దేశంలోని అన్ని రైల్వే ప్రాంతాలను ఈ సర్క్యులర్ టికెట్ తో సందర్శించవచ్చు. అయితే, వీటి ధరలు భిన్నంగా ఉంటాయి. ఆ వివరాలు రైల్వే జోనల్ అధికారులను సంప్రదిస్తే తెలుస్తుంది.

error: Content is protected !!