ఆంధ్రప్రదేశ్ ఉచిత ఇళ్ళ స్థలాల పథకం లబ్దిదారులకు శుభవార్త రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఉచితంగా ఇళ్ల స్థలాలను అందిస్తోంది. ఈ పథకం ద్వారా వేలాది కుటుంబాలు లబ్ధిపొందనున్నాయి.
📌 పథకం పేరు : పీఎంఏవై-ఎన్టీఆర్ నగర్ (ఉచిత ఇళ్ల స్థలాల పథకం)
పేదలకు గృహనిర్మాణం కలగాలనే లక్ష్యంతో ‘పీఎంఏవై-ఎన్టీఆర్’ నగర్ కార్యక్రమం కింద ప్రభుత్వం ప్రారంభం చేసింది
Also Read
📅 ప్రారంభ తేదీ : 2025
ఇంకా ప్రారంభ తేది ఖరారు కాలేదు
🎯 పథకం ఉద్దేశ్యం :
- భూమిలేని ప్రజలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు కేటాయిస్తోంది.
- మహిళల పేరుతో పట్టాలుగా (title deeds) మంజూరు చేస్తోంది.
- అనంతరం ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం కూడా అందిస్తోంది.
✅ అర్హతలు :
అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ నివాసితుడు అయి ఉండాలి
• కుటుంబం బీపీఎల్ (BPL) జాబితాలో ఉండాలి
• ఇల్లు లేదా స్థలం కలిగి ఉండకూడదు
• ఎస్సీ / ఎస్టీ / బీసీ / మైనారిటీలకు ప్రాధాన్యత
• విధవులు / మహిళా ప్రధాన కుటుంబాలు అర్హత పొందవచ్చు
🖥️ దరఖాస్తు విధానం :
1. అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి: https://housing.ap.gov.in/
2. “Apply for Housing Scheme” పై క్లిక్ చేయండి
3. వివరాలు పూరించండి
4. డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి
5. సబ్మిట్ చేసి, acknowledgment slip డౌన్లోడ్ చేసుకోండి
🖥️ దరఖాస్తు ఫారం :
📄 అవసరమైన డాక్యుమెంట్లు :
• ఆధార్ కార్డు
• తెలుపు రేషన్ కార్డు / ఆదాయ ధృవీకరణ పత్రం
• నివాస ధృవీకరణ పత్రం
• కుల ధృవీకరణ పత్రం (అవసరమైతే)
• పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
• బ్యాంక్ అకౌంట్ వివరాలు
🌐 అధికారిక వెబ్సైట్ :
▶️వెబ్సైట్ : Click Here
🔍 లబ్ధిదారుల జాబితా ఎలా చెక్ చేయాలి?
మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందా లేదో తెలుసుకోండి ▶️వెబ్సైట్ : Click Here
1. జిల్లా, మండలాన్ని ఎంచుకోండి
2. ఆధార్ నంబర్ లేదా రేషన్ కార్డ్ నంబర్ ఇవ్వండి
3. “Search” పై క్లిక్ చేయండి
✅ఉచిత ఇంటి స్థలాల రూల్స్ – జీవో నం. 23 ప్రకారం :
- ఉచితంగా ఇంటి స్థలాలు రాష్ట్రంలో అర్హులైన పేదలకు కేటాయిస్తారు.
- గ్రామీణ ప్రాంతాల్లో గరిష్టంగా 3 సెంట్ల భూమి ఇవ్వబడుతుంది.
- పట్టణ ప్రాంతాల్లో గరిష్టంగా 2 సెంట్ల భూమి కేటాయిస్తారు.
- లబ్ధిదారుడు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి.
- లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారై ఉండాలి.
- కుటుంబంలో ఎవరికి అయినా ఇంటి స్థలం లేకపోవాలి.
- ప్రభుత్వ ఉద్యోగులు/పెన్షనర్లు అర్హులు కారు.
- ఇప్పటికే మీకు భూమి కలిగి ఉన్నవారు అయితే మీకు కేటాయింపు ఉండదు గ్రామీణ ప్రాంతాలలో – 5 సెంట్లు, పట్టణ ప్రాంతాలలో – 2.5 సెంట్లు.
- చెల్లుబాటు అయ్యే ఆధార్, రేషన్ కార్డు తప్పనిసరి.
- ఇంటి స్థలం ఇప్పటికే ప్రభుత్వ పథకాల ద్వారా పొందినవారు మళ్లీ అర్హులు కారు.
- మైనర్ వయస్సులో ఉన్న వారికి స్థలం ఇవ్వబడదు.
- మున్సిపాలిటీల్లో ప్రభుత్వ భూముల లభ్యత ఉన్నచో మాత్రమే ఇవ్వబడుతుంది.
- స్థలం లేని చోట ఏపీ టిడ్కో లేదా ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా నిర్మాణాలు చేస్తారు.
- స్థలానికి లీగల్ ఇబ్బందులు ఉండకూడదు.
- కుటుంబానికి ఒకరికి మాత్రమే లబ్ధి వర్తిస్తుంది.
- గిరిజనులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
- స్థలం కేటాయించిన తర్వాత 2 సంవత్సరాల్లో ఇల్లు నిర్మించాలి.
- ఇంటి స్థలాన్ని వేరేవారికి అమ్మడం, ఇవ్వడం నిషేధం.
- స్థలాల లేఅవుట్ సర్వే, అప్రమత్తంగా చేయాలి.
- ప్రతి లబ్ధిదారునికి స్థలం కేటాయింపు పత్రం (పట్టా) ఇవ్వబడుతుంది.
- జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక జరగాలి.
- గ్రామ సచివాలయం ద్వారా పరిశీలన నిర్వహించాలి.
- ఎంపికైన లబ్ధిదారుల జాబితా గ్రామంలో ప్రదర్శించాలి.
- అభ్యంతరాలుంటే గ్రామ సభలో పరిష్కరించాలి.
- ఖాళీ భూములు సేకరించడానికి ప్రైవేట్ భూములు కొనుగోలు చేయవచ్చు.
- కుటుంబ ఆదాయం ₹10,000 (గ్రామీణ), ₹12,000 (పట్టణ) లోపల ఉండాలి.
- అర్హత కలిగిన మహిళల పేర మీద స్థలం కేటాయింపు ఉంటుంది.
- స్థలంలో స్వయంగా నివసించాల్సిన నిబంధన ఉంటుంది.
- ఓపెన్ ప్లాట్లు, అందుబాటులో ఉన్న స్థలాలు మాత్రమే ఇచ్చే వీలు.
- లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకత పాటించాలి.
🆕 తాజా సమాచారం (2025)
• అన్ని జిల్లాలలో కొత్త లేఅవుట్లు అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం
• మహిళలకు పేరుపై పట్టాలు మంజూరు
• నిరుద్యోగులు మరియు వితంతువులకు ప్రత్యేక ప్రాధాన్యత
ఇలా ప్రతి రోజు న్యూస్ & ప్రభుత్వ పథకాలు సమాచారం కావాల్సినవారు మన గ్రూప్ లో జాయిన్ అవ్వండి