WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Ap Schemes

AP Free House Site Scheme 2025 : Full Details , Eligibility & Online Apply

Follow us:

ఆంధ్రప్రదేశ్ ఉచిత ఇళ్ళ స్థలాల పథకం లబ్దిదారులకు శుభవార్త రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఉచితంగా ఇళ్ల స్థలాలను అందిస్తోంది. ఈ పథకం ద్వారా వేలాది కుటుంబాలు లబ్ధిపొందనున్నాయి.

📌 పథకం పేరు : పీఎంఏవై-ఎన్టీఆర్‌ నగర్‌ (ఉచిత ఇళ్ల స్థలాల పథకం)

పేదలకు గృహనిర్మాణం కలగాలనే లక్ష్యంతో ‘పీఎంఏవై-ఎన్టీఆర్‌’ నగర్‌ కార్యక్రమం కింద ప్రభుత్వం ప్రారంభం చేసింది

📅 ప్రారంభ తేదీ : 2025

ఇంకా ప్రారంభ తేది ఖరారు కాలేదు

🎯 పథకం ఉద్దేశ్యం :

  • భూమిలేని ప్రజలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు కేటాయిస్తోంది.
  • మహిళల పేరుతో పట్టాలుగా (title deeds) మంజూరు చేస్తోంది.
  • అనంతరం ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం కూడా అందిస్తోంది.

✅ అర్హతలు :

అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ నివాసితుడు అయి ఉండాలి
•   కుటుంబం బీపీఎల్ (BPL) జాబితాలో ఉండాలి
•   ఇల్లు లేదా స్థలం కలిగి ఉండకూడదు
•   ఎస్సీ / ఎస్టీ / బీసీ / మైనారిటీలకు ప్రాధాన్యత
•   విధవులు / మహిళా ప్రధాన కుటుంబాలు అర్హత పొందవచ్చు

🖥️ దరఖాస్తు విధానం :

1. అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి: https://housing.ap.gov.in/
2. “Apply for Housing Scheme” పై క్లిక్ చేయండి
3. వివరాలు పూరించండి
4. డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి
5. సబ్మిట్ చేసి, acknowledgment slip డౌన్‌లోడ్ చేసుకోండి

🖥️ దరఖాస్తు ఫారం :

📄 అవసరమైన డాక్యుమెంట్లు :

• ఆధార్ కార్డు
• తెలుపు రేషన్ కార్డు / ఆదాయ ధృవీకరణ పత్రం
• నివాస ధృవీకరణ పత్రం
• కుల ధృవీకరణ పత్రం (అవసరమైతే)
• పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
• బ్యాంక్ అకౌంట్ వివరాలు

🌐 అధికారిక వెబ్‌సైట్ :

▶️వెబ్‌సైట్ : Click Here

🔍 లబ్ధిదారుల జాబితా ఎలా చెక్ చేయాలి?

మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందా లేదో తెలుసుకోండి ▶️వెబ్‌సైట్ : Click Here
1. జిల్లా, మండలాన్ని ఎంచుకోండి
2. ఆధార్ నంబర్ లేదా రేషన్ కార్డ్ నంబర్ ఇవ్వండి
3. “Search” పై క్లిక్ చేయండి

✅ఉచిత ఇంటి స్థలాల రూల్స్ – జీవో నం. 23 ప్రకారం :

  1. ఉచితంగా ఇంటి స్థలాలు రాష్ట్రంలో అర్హులైన పేదలకు కేటాయిస్తారు.
  2. గ్రామీణ ప్రాంతాల్లో గరిష్టంగా 3 సెంట్ల భూమి ఇవ్వబడుతుంది.
  3. పట్టణ ప్రాంతాల్లో గరిష్టంగా 2 సెంట్ల భూమి కేటాయిస్తారు.
  4. లబ్ధిదారుడు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి.
  5. లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారై ఉండాలి.
  6. కుటుంబంలో ఎవరికి అయినా ఇంటి స్థలం లేకపోవాలి.
  7. ప్రభుత్వ ఉద్యోగులు/పెన్షనర్లు అర్హులు కారు.
  8. ఇప్పటికే మీకు భూమి కలిగి ఉన్నవారు అయితే మీకు కేటాయింపు ఉండదు గ్రామీణ ప్రాంతాలలో – 5 సెంట్లు, పట్టణ ప్రాంతాలలో – 2.5 సెంట్లు.
  9. చెల్లుబాటు అయ్యే ఆధార్, రేషన్ కార్డు తప్పనిసరి.
  10. ఇంటి స్థలం ఇప్పటికే ప్రభుత్వ పథకాల ద్వారా పొందినవారు మళ్లీ అర్హులు కారు.
  11. మైనర్ వయస్సులో ఉన్న వారికి స్థలం ఇవ్వబడదు.
  12. మున్సిపాలిటీల్లో ప్రభుత్వ భూముల లభ్యత ఉన్నచో మాత్రమే ఇవ్వబడుతుంది.
  13. స్థలం లేని చోట ఏపీ టిడ్కో లేదా ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా నిర్మాణాలు చేస్తారు.
  14. స్థలానికి లీగల్ ఇబ్బందులు ఉండకూడదు.
  15. కుటుంబానికి ఒకరికి మాత్రమే లబ్ధి వర్తిస్తుంది.
  16. గిరిజనులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
  17. స్థలం కేటాయించిన తర్వాత 2 సంవత్సరాల్లో ఇల్లు నిర్మించాలి.
  18. ఇంటి స్థలాన్ని వేరేవారికి అమ్మడం, ఇవ్వడం నిషేధం.
  19. స్థలాల లేఅవుట్ సర్వే, అప్రమత్తంగా చేయాలి.
  20. ప్రతి లబ్ధిదారునికి స్థలం కేటాయింపు పత్రం (పట్టా) ఇవ్వబడుతుంది.
  21. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక జరగాలి.
  22. గ్రామ సచివాలయం ద్వారా పరిశీలన నిర్వహించాలి.
  23. ఎంపికైన లబ్ధిదారుల జాబితా గ్రామంలో ప్రదర్శించాలి.
  24. అభ్యంతరాలుంటే గ్రామ సభలో పరిష్కరించాలి.
  25. ఖాళీ భూములు సేకరించడానికి ప్రైవేట్ భూములు కొనుగోలు చేయవచ్చు.
  26. కుటుంబ ఆదాయం ₹10,000 (గ్రామీణ), ₹12,000 (పట్టణ) లోపల ఉండాలి.
  27. అర్హత కలిగిన మహిళల పేర మీద స్థలం కేటాయింపు ఉంటుంది.
  28. స్థలంలో స్వయంగా నివసించాల్సిన నిబంధన ఉంటుంది.
  29. ఓపెన్ ప్లాట్లు, అందుబాటులో ఉన్న స్థలాలు మాత్రమే ఇచ్చే వీలు.
  30. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకత పాటించాలి.

🆕 తాజా సమాచారం (2025)


• అన్ని జిల్లాలలో కొత్త లేఅవుట్లు అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం
• మహిళలకు పేరుపై పట్టాలు మంజూరు
• నిరుద్యోగులు మరియు వితంతువులకు ప్రత్యేక ప్రాధాన్యత

ఇలా ప్రతి రోజు న్యూస్ & ప్రభుత్వ పథకాలు సమాచారం కావాల్సినవారు మన గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Raj Kumar

Related Posts

error: Content is protected !!